హెచ్ఆర్ఏ, ఫిట్‌మెంట్‌పై ఏపీ సర్కార్ తాజా ప్రతిపాదనలు..!
మంత్రుల కమిటీతో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది.. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం..
హెచ్ఆర్ఏ శ్లాబుల్లో కీలక సవరణల దిశగా చర్చలు సాగాయి.. మంత్రులు నాలుగు శ్లాబులు ప్రతిపాదించినట్లు సమాచారం.. 2 లక్షల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదన పెట్టగా.. అదే 2 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉంటే 12 శాతం హెచ్‌ఆర్‌ఏ, ఇక, 5-15 లక్షల జనాభా ఉన్న నగరాల్లో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ప్రతిపాదించింది. 15 లక్షలకు పైగా జనాభా ఉండే నగరాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని పేర్కొంది ప్రభుత్వం..
అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానంలోనూ కీలక ముందడుగు పడినట్టుగా తెలుస్తోంది.. 70 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు 5 శాతం అదనపు పెన్షన్ సదుపాయం.. 75 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు 10 శాతం అదనపు పెన్షన్ సదుపాయం, 80 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు 20 శాతం అదనపు పెన్షన్ సదుపాయం కల్పించనున్నట్టు ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఫిట్‌మెంట్‌పైనా కీలక ఆలోచన జరిగినట్టుగా సమాచారం అందుతుండగా.. 23 శాతం ఫిట్‌మెంట్‌కు గతంలోనే అంగీకరించారు ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగుల్లో అసంతృప్తితో ఫిట్‌మెంట్ పెంపుపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. 24 శాతానికి పైబడిన ఫిట్‌మెంట్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు.. పదేళ్ల కేంద్ర పీఆర్సీకి బదులు.. ఐదేళ్ల రాష్ట్ర పీఆర్సీకి సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అయితే, మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీ భేటీ సుదీర్ఘంగా సాగింది.. నాలుగున్నర గంటలకు పైగా సమావేశం జరిగింది.
No Comment to " హెచ్ఆర్ఏ, ఫిట్‌మెంట్‌పై ఏపీ సర్కార్ తాజా ప్రతిపాదనలు..! "