అమ్మఒడి - మీ ఆధార్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో తెలుసుకోండి
అమ్మఒడి డబ్బులు విడుదల తేదీ ఖరారు చేసిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం..!*
అమరావతి:- గురువారం (12-5-2022) న కేబినెట్ మీటింగ్ జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలలో ఈ అమ్మఒడి కార్యక్రమం గురించి, విద్యార్థులు యొక్క తల్లి ఖాతాలో జూన్ 21వ తేది (21-06-2022) డబ్బులు వేయడానికి తేదీని ఖరారు చేసారు.ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 10 వేల కోట్లు వరకు ఖర్చు అవుతాయి.
*అమ్మఒడి పధకంలో ఈ సంవత్సరం కూడా ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలంటే ఈ క్రింద వాటిని మాత్రం మర్చి పోవద్దండి.*
1. విద్యార్థి మరియు తల్లి కి eKYC అయి ఉండాలి
2. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధారీ లింక్ అయి ఉండాలి.ఆధార్ లింక్ అంటే NPCI లింక్ అయి ఉండాలి.
3. తల్లి, మరియు పిల్లలు ఒకే కుటుంభంగా వాలంటీర్ యొక్క హౌస్ మాపింగ్ లో మరియు రేషన్ కార్ద్ లొ కూడ ఉండాలి
4. విద్యార్థికి స్కూల్ నందు 75% హాజరు ఉంటేనే ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తుంది.అనే విషయాన్ని మాత్రం ఎక్కడా, ఎప్పుడూ మరచిపోవద్దండి
*గమనిక-* ప్రతి సంవత్సరం మనము ఇచ్చిన బ్యాంక్ ఖాతాలలో అమౌంట్ జమ చేయడం జరిగింది కదా, అదే సరిపోతుంది అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది.
మొదట మీరు చేయాల్సింది ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార కార్డ్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో ఆ బ్యాంక్ పేరు చూపిస్తుంది. కాబట్టి ఆ బ్యాంక్ నే స్కూల్ లో ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి.
మీ ఆధార్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో ఈ లింక్ ద్వారా తెలుసుకోండి.
No Comment to " అమ్మఒడి - మీ ఆధార్ ఏ బ్యాంక్ కి లింక్ అయిందో తెలుసుకోండి "