News Ticker

Menu

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలకు (AP New District) నోటిఫికేషన్ జారీ చేసింది.

 

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలకు (AP New District) నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విభజించింది. దీంతో మొత్తం 26 జిల్లాలకు నోటిఫికే,న్ ఇచ్చింది. కొత్త జిల్లాలపై 30 రోజుల్లో అభ్యంతరాలు సేకరించి తదుపరి ప్రక్రియను మొదలుపెడతారు. ఉగాది నాటికి ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమలులోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాల పరిధిగా తీసుకున్న ప్రభుత్వం.. ఆయా ప్రాంతాల భౌగోళిక, సామాజిక, సాంస్క్రతిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే ఆయా ప్రాంతాల ప్రాముఖ్యత, ప్రముఖ వ్యక్తుల కృషిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలకు పేర్లు పెట్టింది.

శ్రీకాకుళం జిల్లా కు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు విజయనగరం, మన్యం జిల్లాకు పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాకు పాడేరు, విశాఖపట్నం జిల్లాకు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాకు అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాకు కాకినాడ, కోనసీమ జిల్లాకు అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లాకు రాజమహేంద్రవరం, నరసాపురం జిల్లాకు భీమవరం, పశ్చిమగోదావరి జిల్లాకు ఏలూరు, కృష్ణాజిల్లాకు మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లాకు విజయవాడ, గుంటూరు జిల్లాకు గుంటూరు, బాపట్ల జిల్లాకు బాపట్ల, పల్నాడు జిల్లాకు నరసరావుపేట, ప్రకాశం జిల్లాకు ఒంగోలు, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాకు నెల్లూరు, కర్నూలు జిల్లాకు కర్నూలు, నంద్యాల జిల్లాకు నంద్యాల, అనంతపురం జిల్లాకు అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాకు కడప, అన్నమయ్య జిల్లాకు రాయచోటి, చిత్తూరు జిల్లాకు చిత్తూరు, శ్రీబాలాజీ జిల్లాకు తిరుపతి హెడ్ క్వార్టర్స్ గా ఉండబోతున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటికే 13 జిల్లాలున్నాయి. కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కోనసీమ జిల్లా, రాజమహేంద్రవరం జిల్లా, నర్సాపురం జిల్లా, విజయవాడ జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, నంద్యాల జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, శ్రీబాలాజీ జిల్లా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సగటున ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

ఉగాది నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేలోగా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి స్థలాల ఎంపికతో పాటు సిబ్బంది కేటాయింపు, ఇతర కీలక అంశాలపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. కొత్త జిల్లాలతో పాటు మరో 15 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.

Download Gazette

Guidelines for Conduct of SMC & SMDC (Parent Committee) Trainings

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలకు (AP New District) నోటిఫికేషన్ జారీ చేసింది. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM