ఇలా నెలకి లక్షన్నర పెన్షన్ ని పొందండి
ఇలా నెలకి లక్షన్నర పెన్షన్ ని పొందండి..!
మీరు నెల నెలా పెన్షన్ ని పొందాలని అనుకుంటున్నారా..? ఎందులోనైనా డబ్బులు పెట్టి ప్రతీ నెలా పెన్షన్ ని తీసుకోవాలంటే మీకు ఒక ఆప్షన్ వుంది. ఇలా కనుక చేస్తే కచ్చితంగా నెల నెలా పెన్షన్ ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రతీ నెలా నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా మంచిగా డబ్బులు పొందొచ్చు. ఈ NPS స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ.లక్షన్నర పొందొచ్చు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ PFRDA చూసుకుంటుందన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరచ్చు. అయితే ఈ స్కీమ్ లో మెచ్యూరిటీ అమౌంట్‌లో కనీసం 40 శాతాన్ని పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది.
మిగతా 60 శాతం తీసుకో వచ్చు. ఇలా పెన్షన్ స్కీమ్ లో పెట్టిన డబ్బులతో ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. 100 శాతం ఎన్‌పీఎస్ మెచ్యూరిటీ డబ్బులను కూడా పెన్షన్ స్కీమ్‌లో కావాలంటే పెట్టచ్చు. ఈ స్కీమ్ లో ఎన్‌పీఎస్ అకౌంట్‌లో 30 ఏళ్ల పాటు నెలకు రూ.12 వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెలా రూ.1.78 లక్షల పెన్షన్ వస్తుంది.
APPOLYCET - 2021 ADMISSIONS - College-wise Allotment Details
మెచ్యూరిటీ సమయంలో చేతికి 60 శాతం వస్తాయ్. అంటే రూ.1.64 కోట్లు. మిగతా 40 శాతం రూ.1.04 కోట్లను యాన్యుటీ ప్లాన్‌లో పెట్టాలి. దీని ద్వారా నెలకు రూ.54,700 పెన్షన్ వస్తుంది. 60 శాతం మొత్తాన్ని సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయెల్ ప్లాన్‌లో 25 ఏళ్ల కాల పరిమితితో పెట్టాలి. దీనితో నెలకు రూ.1.23 లక్షలు వస్తాయి. అంటే నెలకు రూ.1.7 లక్షలు ఈ స్కీమ్ కింద పొందొచ్చు.
ఇవి కూడా చదవండి
Notification No.20/2021, Date.12/10/2021 - Various Non-Gazetted Posts General/Limited Recruitment
మీ Vehicle మీద ఏమన్నా RTO E-Challans ఉన్నాయేమో check చేసుకోండి
Join My whatsapp Group
























No Comment to " ఇలా నెలకి లక్షన్నర పెన్షన్ ని పొందండి "