UPDATE YOUR HEALTH CARD-EDIT OPTION HAS BEEN PROVIDED FOR THE EMPLOYEES IN EHS LOGINS -హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం
Edit option has been provided for the Employees in EHS logins to update the details to print smart health cards.
ఉద్యోగ,
ఉపాధ్యాయ, పెన్షనర్ల హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్గారు కల్పించా రు
ఇహెచ్ఎస్ లాగిన్ నందు హెల్త్ కార్డులలో మార్పులను 7 రోజులోగా సరిదిద్దుకోవాలని సిఇఓ గారు కోరారు. సరిదిద్దిన అనంతరం ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్ కార్డుల స్థానంలో స్మార్ట్ హెల్త్ కార్డులను మంజూరు చేస్తున్నారని తెలియజేశారు. కనుక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హెల్త్ కార్డులో సమాచారం సవరించుకొని స్మార్ట్ హెల్త్ కార్డు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మిగిలిన ఉద్యోగులకు చెల్లించినట్లు యాజమాన్య వాటా హెల్త్ కార్డుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు హెల్త్ కార్డులలో మార్పులను 7 రోజులోగా సరిదిద్దుకోవాలి
user id your employe id
ఒక వేళ మీరు పాస్వర్డ్ కనుక మరిచిపోయినట్టు అయితే FORGOT పాస్వర్డ్ క్లిక్ చేయండి EHS లో మీరు రిజిస్టర్ ఆయినా మొబైల్ కి పాస్వర్డ్ వస్తుంది దాని ద్వారా మీరు లాగిన్ అవ్వవచ్చు
యూసర్ ID మీ TREASURY ID
ఉద్యోగులందరికి SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు, దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి EHS కార్డ్ వివరాలను EDIT చేసుకోవాల్సి ఉంటుంది, మన పేరు, జెండర్,మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, DESIGNATION, మన లేటెస్ట్ ఫోటో ఏ విధంగా అప్డేట్ చేయాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి,ఈ వివరాలు స్మార్ట్ హెల్త్ కార్డ్ లోకి వస్తాయి
r. YSR Aarogyasri Health Care Trust
( Govt. of Andhra Pradesh)*
*పత్రికా ప్రకటన
EHS ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకు గమనిక*
డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు QR కోడ్ తో కూడిన EHS స్మార్ట్ హెల్త్ కార్డ్ ని జారీ చేయడం జరుగుతున్నది. QR కోడ్ కలిగిన EHS స్మార్ట్ హెల్త్ కార్డ్ జారీ కొరకు మీ వివరాలను EHS పోర్టల్ లాగిన్ ద్వారా సరిచుసుకొని మార్పులు ఉన్నయెడల ఏడు రోజులలో అప్డేట్ చెయ్యండి. ఇందుకొరకు మీరు EHS పోర్టల్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లతో లాగిన్ అయ్యాక, డౌన్ లోడ్ హెల్త్ కార్డ్స్ మీద క్లిక్ చేసిన యెడల మీకు ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీరు మీ వివరాలను అప్డేట్ చేయగలరు.
ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించి మీ లాగిన్ సరిచూసుకొని అందులో మీ పేరు, జెండర్, చిరునామా, ఫోటో, ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ సరిగా ఉన్నాయో లేదో గమనించి అక్కడ ఏదైనా తప్పులు ఉన్నచో సరిదిద్దుకోనుటకు ఏడు రోజులు గడువు ఇవ్వబడినది. మీరు అప్డేట్ చెయ్యని యెడల ఉద్యోగస్తుల మరియు పెన్షనర్ల దరఖాస్తులో ఉన్న వివరాలు సరైనవే అని భావించి స్మార్ట్ హెల్త్ కార్డులో ఆ వివరాలు ప్రింట్ చెయ్యడం జరుగుతుంది.
ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు ఈ అవకాశాన్ని గమనించి మీ లాగిన్ ని సరిచేసుకొని డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కి సహకరించగలరు అని డాII ఏ. మల్లికార్జున, IAS, ముఖ్య కార్య నిర్వహణ అధికారి, డాII వై. యస్. ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వారు కోరడమైనది.
ఏదైనా సందేహాల కొరకు
టోల్ ఫ్రీ నెంబర్ 104 కి మరియు 8333817469, 8333817406, 8333817414 లకు ఫోన్ చెయ్యగలరు.
అలాగే ap_ehf@ysraarogyasri.ap.gov.in, ap_c439@ysraarogyasri.ap.gov.in కి మెయిల్ చెయ్యగలరు.
FILL BLOOD GROUP, ADDRESS DETAILS(IF ANY CHANGE)
DEPARTMENT DETAILS AND DESIGNATION. YOU CAN
UPLOAD NEW PHOTO BY SELECTING CHOOSE FILE. FINALLY
CLICK ON SUBMIT BUTTON. NO NEED TO ENTER ADDRESS,
DEPARTMENT DETAILS FOR DEPENDENTS. BLOOD GROUP
DETAILS AND PHOTO MAY BE CHANGED(IF YOU WISH)
CLICK HERE FOR EHS WEBSITE
ADD ME IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES MY NUMBER 8985727170
No Comment to " UPDATE YOUR HEALTH CARD-EDIT OPTION HAS BEEN PROVIDED FOR THE EMPLOYEES IN EHS LOGINS -హెల్త్ కార్డులలో సవరణకు అవకాశం "