News Ticker

Menu

అమ్మఒడి NEW UPDATE - Check Adhaar - Bank Account Link status

 *అమ్మఒడి NEW UPDATE*



*👉గత రెండు సంవత్సరములు అమ్మఒడి పథకం డబ్బులు మీరు మీ యొక్క  బ్యాంకు అకౌంట్ వివరాలు స్కూల్ ఇచ్చేవారు , వాటినే  స్కూల్ లాగిన్ లో ENROLL చేసేవారు, ఆ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడేవి*

*👉కానీ ఈ సంవత్సరం ఆలా కాదు. NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మఒడి డబ్బులు పడతాయి. NPCI లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో ENROLL చేయాలి. NPCI అనగా NATIONAL PAYMENT CORPORATION OF INDIA. ఇది కేవలం అమ్మఒడి అనే కాదు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ నగదు అయినా NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే పడతాయి . అది అమ్మఒడి కావచ్చు మరొకటి కావచ్చు.*

*👉బ్యాంకు అకౌంట్ NPCI కి LINK చేయటమంటే ఇదేదో కొత్తగా శ్రమ తీసుకొని చేయవలసిన పని ఏమి కాదు. బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయబడి ఉండటమే. ఆధార్ తో లింక్ చేయబడిన ప్రతి ఒక్కరి ఒక అకౌంట్ ఇప్పటికే మన ప్రమేయం లేకుండానే NPCI కి LINK చేయబడే ఉంటుంది. ఇక్కడ ఒక అకౌంట్ అనేది గమనించాల్సిన విషయం. ఒక వ్యక్తికీ మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్ లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏది NPCI కి లింక్ అయి ఉంది అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఎలా తెలుసుకోవాలి అనేది క్రింద వివరించటం జరిగింది.*



*👉మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏ అకౌంట్ NPCI కి లింక్ అయి ఉంది, దానినే స్కూల్ లో ఇచ్చామా లేక వేరేది ఇచ్చామా అనేది సరి చూసుకోవాలి. రెండు ఒకటే అయితే సరే అమ్మఒడి డబ్బులు వస్తాయి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు, రెండు ఒకటే ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.*

*👉ఒక PARENT ఒక బ్యాంకు లో మాత్రమే అకౌంట్ ఉంది అనుకుందాం, ఒక అకౌంట్ మాత్రమే ఉంది అది ఆధార్ లో లింక్ అయి ఉంది కాబట్టి NPCI కి కూడా లింక్ చేయబడి ఉంటుంది , దానినే స్కూల్ లో ఇచ్చి ఉంటారు , దానిలోనే అమ్మఒడి డబ్బులు పడతాయి . ఇక్కడ ఏ సమస్యా రాదు.*

*👉మరొక PARENT కి మూడు బ్యాంకులలో అకౌంట్ లు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు 1.UNION BANK, 2.SBI, 3.BANK OF INDIA అనుకుందాం. వీటిలో ఏది NPCI కి  లింక్ అయి ఉందో అని CHECK చేస్తే SBI చూపిస్తుంది అనుకుందాం, కానీ స్కూల్ లో BANK OF INDIA ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ సమస్య వస్తుంది. BANK OF INDIA లో డబ్బులు పడవు, SBI లో మాత్రమే పడతాయి. గత రెండు సంవత్సరాలు BANK OF INDIA లోనే డబ్బులు పడి నప్పటికీ ఈ సంవత్సరం పడవు.*

*👉ఇప్పుడు PARENT కి రెండు OPTIONS ఉంటాయి.*

*👉మొదటి OPTION , SBI అకౌంట్ వాడుకలో ఉండేలా చూసుకోవాలి ఒకవేళ చాలా రోజులు వాడక INACTIVE లో ఉంటే ACTIVE చేయించాలి  మరియు స్కూల్ లో BANK OF INDIA కి బదులుగా SBI అకౌంట్ వివరాలు ఇచ్చి BANK OF INDIA వివరాలు తీసేసి SBI అకౌంట్ వివరాలు ENROLL చేయమని స్కూల్ వారిని అడగాలి.*

*👉రెండవ OPTION , SBI లో పడడానికి వీలులేదు మాకు ఎప్పటి లాగానే  BANK OF INDIA లోనే పడాలి అంటే , BANK OF INDIA బ్యాంకు కు వెళ్లి అకౌంట్ ని  NPCI కి లింక్ చేయమని బ్యాంకు వారిని అడగాలి.*

*ఇలా NPCI లింక్ అయిన బ్యాంకు అకౌంట్ మాత్రమే స్కూల్ లో ENROLL అయి ఉండేలా చూసుకొనగలరు*

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " అమ్మఒడి NEW UPDATE - Check Adhaar - Bank Account Link status "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM