30 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా తినాల్సిన 7 ఆహార పదార్థాలు
"Health Tips: 30 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా తినాల్సిన 7 ఆహార పదార్థాలు "
వయసు పెరిగే కొద్ది అనారోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. మూప్ఫై క్రాస్ చేశామంటే ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. అయితే వయసు పెరిగినా మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
మూప్ఫై ఏళ్లు దాటిన వారు ఈ ఏడు రకాల పదార్థాలు తమ ఆహారంలో ఉండేటట్లు చూసుకుంటే. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
వయసు 30 ఏళ్లు పైబడిన వాళ్లలో శరీరం క్రమంగా బలహీనపడుతుంటుంది. సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్, ద్రాక్ష, లెమన్ మన ఆహారంలో భాగంగా ఉండేటట్లు చూసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. సిట్రస్ జాతి పండ్లలలో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
బ్రోకలీలో విటమిన్ల అధికంగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. వ్యాధులపై పోరాడటానికి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వెల్లుల్లి మన శరీరంలోని హానికరమైన సూక్ష్మజీవులను చంపడానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
సాల్మన్, ట్రౌట్ ఆయిల్ ఫిష్ లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇవి శరీరంలో అవసరమైన హార్మోన్లను తయారు చేయడంలో సహాయపడతాయి. ఇది మెదడుకు, గుండెకు మేలు చేస్తుంది. ఆయిల్ ఫిష్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
గింజలు బరువు తగ్గడంలో సహాయపడే ఫిల్లింగ్ స్నాక్‌గా ఉపయోగిస్తారు. గింజలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే అధిక ప్రొటీన్, ఫైబర్ గుణాలను కలిగి ఉంటాయి.
తేనెను 5 వేల ఏళ్ల నుంచి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. తేనె అనేక సమస్యలకు సహాజ నివారణ. తేనెలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ ఔషధాన్ని సౌందర్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు.
చియా (సబ్జా) గింజల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్ అనేది మొక్కల ఆధారిత ప్రోటీన్. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపించి ఆకలి అదుపులో ఉంటుంది.
No Comment to " 30 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా తినాల్సిన 7 ఆహార పదార్థాలు "