WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్.. 'Last Seen' కు సంబంధించిన మరో సూపర్ ఆప్షన్.. తెలుసుకోండి
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్.. 'Last Seen' కు సంబంధించిన మరో సూపర్ ఆప్షన్.. తెలుసుకోండి
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తన కస్టమర్లకు థ్రిల్ ఇస్తూనే ఉంటుంది.
IMMS APP UPDATED - UPDATED ON November 12, 2021
తాజాగా యూజర్లకు ప్రైవసీకి సంబంధించిన మరో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది.(ప్రతీకాత్మక చిత్రం)
పెన్షనర్స్ తమ లైఫ్ సర్టిఫికెట్స్ 01.01.2022 నుండి 28.02.2022 వరకు సమర్పించాలని సూచనలతో ఉత్తర్వులు
వాట్సాప్ లో లాస్ట్ సీన్ ఫీచర్ గురించి మనకు తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా మనం గతంలో ఏ సమయంలో వాట్సాప్ యాప్ లోకి వచ్చామో అవతలి వారికి తెలుస్తుంది. అయితే.. లాస్ట్ సీన్ కనిపించకుండా దానిని Hide చేసుకునే ఆప్షన్ కూడా ఇప్పటికే అందించింది వాట్సాప్.(ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటి వరకు లాస్ట్ సీన్ కు సంబంధించి మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి అవి.. 1. Everyone, 2. My Contacts, 3. Nobody. (ప్రతీకాత్మక చిత్రం)
మొదటి ఆప్షన్ ను ఎంచుకున్న వారి లాస్ట్ సీన్ వివరాలు అందరికీ కనిపిస్తాయి. రెండో ఆప్షన్ ను ఎంచుకున్న వారి లాస్ట్ సీన్ వారి ఫోన్ లో సేవ్ అయిన కాంటాక్ట్ నంబర్ల వారికే కనిపిస్తాయి. మూడో ఆప్షన్ ఎంచుకున్న వారి లాస్ట్ సీన్ వివరాలు ఎవరికీ కనిపించవు.(ప్రతీకాత్మక చిత్రం)
SA Telugu & LP Telugu పోస్టులకు MA Telugu వారు కుడా elegible
అయితే.. ఈ మూడు ఆప్షన్లతో పాటు My Contacts Except. అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మనం ఎంచుకున్న వారికి మాత్రమే మన Last Seen వివరాలు కనిపిస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
IMMS APP UPDATED - UPDATED ON November 12, 2021
ప్రొఫైల్ ఫొటో, About ను చూసేందుకు సైతం ఇలాంటి ఆప్షన్లను తీసుకురానుంది Whatsapp. దీంతో ప్రొఫైల్ ఫొటో, About అందరికీ కనిపించకుండా నియంత్రించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
ఆండ్రాయిడ్ 2.21.23.13 అప్‌డేట్లో వాట్సాప్ బీటా టెస్టర్లకు అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చినట్లు WABetaInfo తెలిపింది. త్వరలో ఈ ఫీచర్లు యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.(ప్రతీకాత్మక చిత్రం)
No Comment to " WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్.. 'Last Seen' కు సంబంధించిన మరో సూపర్ ఆప్షన్.. తెలుసుకోండి "