News Ticker

Menu

మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు మొత్తం సెలవులు వివరాలు

 మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు మొత్తం సెలవులు వివరాలు


 మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు ఇప్పటి వరకు సంఘాల ప్రాతినిధ్యం ఫలితంగా క్రింద తెలుపబడిన (CLS,Spl. CLS 15 + 7)సెలవులుమరియుక్రింద ఇవ్వబడిన సెలవులు

1. ప్రసూతి సెలవులు : 180 రోజులు (G.O. Ms. No. 152,తేది : 4-5-2010)

2. అబార్షన్ సెలవులు : 42 రోజులు (G.O. Ms. No. 762,తేది : 11-8-1976)

3. ట్యూబెక్టమీ ఆపరేషన్ సెలవులు : 14 రోజులు (G.O. Ms.No. 1415, 38 : 10-6-1968)

4. రీకానలైజేషన్ ఆపరేషన్ సెలవులు : 21 రోజులు (G.O.Ms. No. 102, తేది : 19-2-1981)

5. గర్భనిరోధక సాధనం (లూప్) అమర్చుటకు : 01 రోజు(G.O.Ms. No. 128, తేది : 13-4-1982)

6. గర్భసంచి తొలగింపు, హిస్టరెక్టమీ ఆపరేషన్ : 45 రోజులు(G.O. Ms. No. 52, తేది : 1-4-2011)

7. మహిళా దినోత్సవం : 01 రోజు (G.O. Ms. No. 433, తేది: 4-8-2010)

8. ప్రత్యేక CLS : 05 రోజులు (G.O. Ms. No. 374, తేది :16-3-1996)

పై విధంగా ప్రత్యేక సెలవులతో పాటు 10వ పి.ఆర్.సి. ప్రతిపాదనలకు అనుగుణంగా సర్వీసు మొత్తంలో పిల్లల సంరక్షణ నిమిత్తం లేక పాఠశాల, కళాశాల స్థాయి పరీక్షల సమయంలోనూ,అనారోగ్యం వగైరాలకు 3 నెలలు (90 రోజులు) వరకు శిశు సంరక్షణ సెలవులు నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ( AP లో 60days) ఈ సదుపాయం మహిళా ఉద్యోగులకు ఒక వరంగా భావించుటలో అతిశయోక్తి లేదు 

దీక్ష లో ప్రొఫైల్ అప్డేట్ చేసిన టీచర్స్ వివరాలు 

 
 1.ఈ సెలవును 6 సార్లుకు తగ్గకుండా ఇద్దరి పిల్లల యొక్క వయస్సు 18 సం. వరకు మరియు అశక్తులైన పిల్లలు (మానసిక| శారీరక / వికలాంగుల) వయస్సు 22 సం. నిండేవరకు ఎన్నిసార్లు అయిననూ వినియోగించుకోవచ్చును

2.ఈ సెలవును LTC నిమిత్తం వాడుకొనుటకు వీలులేదు.ఈ సెలవులు వినియోగించుకోబడిన వివరాలు GO నందు పొందు పర్చబడిన సంబంధిత ప్రొఫార్మా ప్రకారంగా EL'S మరియు అర్థజీతపు సెలవుల అకౌంటు మాదిరిగా సర్వీసు రిజిస్టరు నందు నమోదు పరచాలి

3.ఈ సెలవులు EL'S మరియు అర్థజీతపు సెలవుల అకౌంటు నుండి తగ్గించబడవు

4.ఈ సెలవు వినియోగించుకొనుట హక్కుగా భావించరాదు

5.మంజూరు చేయు అధికారి నుండి ముందస్తు అనుమతిపొంది మాత్రమే లీవుపై వెళ్ళాలి

6.ఈ సెలవు కార్యాలయము / సంస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవాలి

7.ఈ సెలవు సంపాదిత సెలవుగానే పరిగణించాలి

8. ఈ సెలవులు ప్రసూతి సెలవులు మరియు ఇతర సెలవులతో కలుపుకుని అనగా CLs, Spl. CLS కాకుండా వినియోగించు కోవచ్చును

9.ఈ సెలవును కనిష్ఠంగా ఒక్కరోజు కూడా CCL మంజూరు చేయాలి. 15 రోజులు మించకూడదు

10. మొదటి విడత CCL మంజూరు సమయంలో పుట్టిన తేది సర్టిఫికెట్లు దరఖాస్తును జతపరచాలి. ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరం లేదు

11. ఆకస్మికేతర సెలవు (OCL) కు వర్తించే ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి


ప్రైవేట్ స్కూల్ నుంచి మన schools కి వచ్చే విద్యార్థుల TC ఇచ్చే విషయం లో తాజా ఉత్తర్వులు 

 
12. శిశుసంరక్షణ సెలవు ముందురోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు. సెలవు కాలంలో ఇంక్రిమెంటు మంజూరు చేయరు

13.వేతనాన్ని మినహాయించడం, నిబంధనలకు విరుద్ధం

మహిళా ఉద్యోగుల, టీచర్ల పిల్లలు పూర్తిగా వారి పై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే CCL మంజూరు చేస్తారు

జగనన్న గోరుముద్ద (PM POSHAN) పథకం - పాఠశాలలకు గుడ్లు మరియు చిక్కీల సరఫరాపై సూచనలు

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " మహిళా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయినీలకు మొత్తం సెలవులు వివరాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM