జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణ?
జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణ?

అమరావతి: జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇంటర్ మార్కులకు ఎంసెట్ పరీక్షలకు లింక్ ఉందని మంత్రి సురేష్ పేర్కొన్నారు. అలాగే జూలై ఆఖరున టెన్త్ పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందని మంత్రి సురేష్ అన్నారు. గురువారం సీఎం జగన్ దగ్గర పరీక్షల అంశం చర్చిస్తామని సురేష్ తెలిపారు. ఎగ్జామ్స్ రద్దు చేయడానికి నిమిషం కూడా పట్టదని మంత్రి సురేష్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్యం విషయంలో, ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
No Comment to " జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణ? "