ఏపీలో ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
ఏపీలో ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ

అమరావతి:ఏపీలో ఉపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ సూచనలిచ్చింది. టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహకరించాలని అధికారులు సూచించారు. సెలవుల్లో విద్యార్థులకు డిజిటల్ మార్గాల ద్వారా సహకరించాలని, విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా సందేహాలు తీర్చాలని పలు సూచనలు చేశారు. జూన్ 1 నుంచి 5 వరకు పాఠశాలకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు. టెన్త్ పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాల్సిందిగా సూచనలిచ్చారు. పరీక్షల నిర్వహణ, సందేహాల నివృత్తి కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు అధికారులు సూచించారు. టెన్త్ విద్యార్థులకు మే 1 నుంచి 31 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
No Comment to " ఏపీలో ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ "