News Ticker

Menu

PPSC ఎగ్జామ్స్ రాసే వారికి గుడ్ న్యూస్* APPSC పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పాత ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.

APPSC Papers- వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలు-*APPSC ఎగ్జామ్స్ రాసే వారికి గుడ్ న్యూస్*  APPSC పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పాత ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. మొత్తం 54 పరీక్షల ప్రశ్నాపత్రాలు లభ్యం ఇందులో జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్- 1 & గ్రూప్-2 పోస్టులకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు ఉన్నాయి.

 

ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను ఏపీపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రశ్నపత్రాలను పొందుపరచింది. మొత్తం 54 పరీక్షల ప్రశ్నలపత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును ఏపీపీఎస్సీ కల్పించింది. వీటిలో ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పోస్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఉన్నాయి. వీటితోపాటు 2011 గ్రూప్-1 మెయిన్ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు, 2016 గ్రూప్-1, గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు, పంచాయతీ కార్యదర్శి ప్రశ్నపత్రాలను కూడా ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది.
ఇవేగాక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్‌మ్యాన్, డిప్యూటీ సర్వేయర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్, టెక్ అసిస్టెంట్ జియోఫిజిక్స్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్(మైన్స్), అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ పరీక్షలకు పాత ప్రశ్నపత్రాలను ఏపీపీఎస్సీ అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాబోయే పరీక్షలపై ముందస్తు అవగాహన కోసం ఈ ప్రశ్నపత్రాలు ఉపయోగపడతాయి. అభ్యర్థులు వీటి ఆధారంగా పరీక్షలో ప్రశ్నల సరళిపై అవగాహనకు రావచ్చు. దీంతోపాటు ప్రిపరేషన్‌కు సంబంధించి ప్రణాళిక సిద్ధంచేసుకోవడం మరింత సులభమవుతుంది.

డౌన్లోడ్......APPSC ఓల్డ్ పేపర్స్..

Share This:

teacherbook.in

1 comment to ''PPSC ఎగ్జామ్స్ రాసే వారికి గుడ్ న్యూస్* APPSC పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పాత ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. "

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM