సైనిక స్కూల్ తుది ఫలితాల విడుదల
సైనిక స్కూల్ తుది ఫలితాల విడుదల
విజయనగరం గ్రామీణం, న్యూస్టుడే: సైనిక స్కూల్
సొసైటీ నిర్వహించిన 2020 - 21 విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్ష తుది (ఫైనల్)
ఫలితాలు విడుదల అయ్యాయి. కోరుకొండ సైనిక్ పాఠశాలఫలితాలను వెబ్‌సైట్లలో
అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపల్ కల్నల్ అరుణ్ కులకర్ణి ఒక ప్రకటనలో
తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కోరుకొండ, కలికరి సైనిక్ పాఠశాలల
ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. ఇతర వివరాలకు 08922-246119,
246168 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
No Comment to " సైనిక స్కూల్ తుది ఫలితాల విడుదల "