News Ticker

Menu

G.O.No. 607, Dt.21-3-20 - Work from home and working hours to State Government Employees in AP... Orders issued.

ప్రభుత్వోద్యోగులకు వంతులవారీ పని 

 ఒక వారం సగం మంది, మరో వారం రెండో సగం మంది కార్యాలయాలకు
 విధులకు రానివారికి ఇంటి నుంచే పని

ఈనాడు, అమరావతి: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు సోమవారం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం ఉన్నతాధికారులు మినహా.. మిగతా ఉద్యోగులందర్నీ రెండు బృందాలుగా విభజించనుంది. ఒక బృందం ఒక వారం కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తే, రెండో బృందం తర్వాత వారం విధులకు వస్తుంది. కార్యాలయానికి రాని గ్రూపు ఇంటి నుంచి పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల్నీ నియంత్రించాలని, అత్యవసర పని ఉంటే తప్ప అనుమతించరాదనీ నిబంధన విధించనున్నారు. కరోనా నివారణకు సామాజిక దూరం పాటించడమే మార్గమని గుర్తించడంతో అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. 
* రాష్ట్ర సచివాలయంలో విభాగాధిపతి (సెక్షన్‌ ఆఫీసర్‌) కంటే పై స్థాయి అధికారులు మాత్రం రోజూ విధులకు హాజరవుతారు. వీరందరికీ ప్రత్యేకంగా ఛాంబర్లు ఉంటాయి. కాబట్టి వంతులవారీ పని విధానం వర్తింపజేయడం లేదని సమాచారం.
* విభాగాధిపతి కంటే కింది స్థాయి ఉద్యోగుల్ని రెండు బృందాలుగా విభజిస్తారు. వీరిలో ఒక్కోబృందం ఒక్కోవారం విధులకు వస్తుంది.
* సచివాలయ ఉద్యోగులు అందరూ ఒకేసారి విధులకు హాజరవకుండా వేర్వేరు సమయాల్లో వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఒక వారంలో విధులకు హాజరయ్యే ఉద్యోగుల్ని మళ్లీ మూడు బృందాలుగా విభజిస్తారు. ఒక బృందం ఉదయం 9.30కి, రెండో బృందం 10కి, మూడో బృందం 10.30 గంటలకు కార్యాలయానికి రావాల్సి ఉంటుంది.
* ఈ పనివేళలను విభాగాధిపతులు తమ సౌలభ్యాన్ని బట్టి మార్చుకోవచ్చు. కావాలనుకుంటే ఒక్కో బృందం రావడానికి మధ్య గంట వ్యవధినీ పాటించవచ్చు.
* ఏ సెక్షన్‌లోనూ ఎక్కువ రద్దీ లేకుండా, ఉద్యోగుల మధ్య తగినంత దూరం పాటించేలా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.
* జిల్లా స్థాయి కార్యాలయాల్లో గెజిటెడ్‌ అధికారులు, అంతకు పైస్థాయి అధికారులు రోజూ విధులకు రావాలి. కింద స్థాయి ఉద్యోగులకు వంతులవారీ విధానాన్ని వర్తింపజేస్తారు.
* డివిజన్‌, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అక్కడి పరిస్థితుల్ని బట్టి ఉద్యోగులకు వంతులవారీగా విధులు కేటాయిస్తారు.

Share This:

teacherbook.in

No Comment to " G.O.No. 607, Dt.21-3-20 - Work from home and working hours to State Government Employees in AP... Orders issued. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM