ఏటీఎంకు వెళ్లలేకపోతున్నారా? ఇంటికే డబ్బులు పంపిస్తున్న బ్యాంకులు
ATM: ఏటీఎంకు వెళ్లలేకపోతున్నారా? ఇంటికే డబ్బులు పంపిస్తున్న బ్యాంకులు
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా పలు
రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లకే
పరిమితమయ్యారు. అత్యవసర సందర్భాల్లో మాత్రమే బయటకు వస్తున్నారు. పాలు,
కూరగాయలు, మెడిసిన్ లాంటివి కొనడానికి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారు.
కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా మీరు ఏటీఎంలకు వెళ్లలేకపోతున్నారా? అయితే
బ్యాంకులే డబ్బుల్ని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎస్‌బీఐ,
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా
బ్యాంకులు కస్టమర్లకు డబ్బుల్ని ఇంటికే పంపిస్తున్నాయి. అత్యవసరంగా
డబ్బులు కావాల్సి వస్తే బ్యాంకును సంప్రదించొచ్చు.
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్
అయితే డోర్‌స్టెప్ డెలివరీ సర్వీసెస్‌ని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ డబ్బులు
డిపాజిట్ చేయాలన్నీ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం వృద్ధులు,
వికలాంగులకు మాత్రమే ఈ సదుపాయాలున్నాయి. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఏ కస్టమర్
అయినా ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు.
రూ.100 ఛార్జీ చెల్లించాలి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఇలాంటి సేవల్నే
అందిస్తోంది. అయితే రూ.5000 నుంచి రూ.25000 మధ్య మాత్రమే క్యాష్
అందిస్తుంది. ఇందుకు రూ.100 నుంచి రూ.200 మధ్య ఛార్జీలు చెల్లించాలి.
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ సేవల్ని అందిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2
గంటల వరకు క్యాష్ ఆర్డర్ చేయొచ్చు. రూ.2000 నుంచి రూ.2,00,000 మధ్య
డబ్బులు ఆర్డర్ చేయొచ్చు. కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా
డోర్‌స్టెప్ డెలివరీ సర్వీసెస్‌ని అందిస్తున్నాయి.
No Comment to " ఏటీఎంకు వెళ్లలేకపోతున్నారా? ఇంటికే డబ్బులు పంపిస్తున్న బ్యాంకులు "