ఏపీ గ్రామ సచివాలయాల్లో సుమారు 16 వేల ఖాళీలు
ఏపీ గ్రామ సచివాలయాల్లో సుమారు 16 వేల ఖాళీలు
ఈనాడు: ఏపీ గ్రామ సచివాలయాల్లో సుమారు 16 వేల ఖాళీల భర్తీకి శుక్రవారం (జనవరి 10)న ప్రకటన వెలువడనుంది. కొత్తగా మరో 300 సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఖాళీల సంఖ్య మరో మూడు వేలు పెరగడానికి అవకాశాలున్నాయి. పోస్టులను పంచాయతీ రాజ్ శాఖ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపిక విధానం గత నియామకాల మాదిరిగానే ఉంటుంది. ఇందుకోసం పాత మార్గదర్శకాలనే అనుసరించనున్నారు. ఆయా పోస్టుల వారీ ఖాళీల వివరాలు పంచాయతీ రాజ్ శాఖకు అందాయి. అత్యధికంగా పశుసంవర్థక శాఖలో ఏడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి. ఉద్యాన అసిస్టెంట్ 1746, విలేజ్ సర్వేయర్ 1234, డిజిటల్ అసిస్టెంట్ 1122 పోస్టులు కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని అంచనా. ఇవన్నీ గత నియామకాల్లో భర్తీ కాకుండా మిగిలి పోయిన పోస్టులే. మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ఏపీ సీఎం జగన్మోహన రెడ్డి ఆదేశించడంతో వాటికి సంబంధించిన ఖాళీలను ఈ నోటిఫికేషన్ తో భర్తీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో అన్ని విభాగాల్లోనూ కొన్నేసి చొప్పున ఖాళీల సంఖ్య పెరగనుంది.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ
ప్రభుత్వం. గ్రామ సచివాలయాల్లో మొత్తం 14,061 ఉద్యోగాల భర్తీకి
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ
పోస్టులకు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుండగా.. జనవరి
31వ తేదీ వరకు తుది గడువు అని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే సర్వీసులో
ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ
ఇవ్వనున్నట్లు గిరిజా శంకర్ పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి తరువాత
రాత పరీక్ష ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. వీటికి సంబంధించి
gramasachivalayam.ap.gov.in,vsws.ap.gov.in,wardsachivalayam.ap.gov.in
వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు.
మరోవైపు వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు
చేసుకునేందుకు జనవరి 31వ తేది వరకు గడువు ఇచ్చారు.
wardsachivalayam.ap.gov.in, gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్లలో ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.
No Comment to " ఏపీ గ్రామ సచివాలయాల్లో సుమారు 16 వేల ఖాళీలు "