అమ్మఒడికి మరో అవకాశం
JAGANANNA AMMAVODI-అమ్మఒడికి మరో అవకాశం
● మూడు జాబితాలతో ప్రజల ముంగిటకు.● ఎంఈవో కార్యాలయాల్లో గ్రీవెన్స్ విభాగాల ఏర్పాటు.
● జనవరి ఒకటి వరకు సామాజిక ఆడిట్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘అమ్మఒడి’ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ వర్తింపజేయాలనే ఆలోచనతో తాజాగా మండల విద్యాశాఖ కార్యాలయాల్లో గ్రీవెన్స్ స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వినతులు, అర్జీలను మండల విద్యాశాఖ అధికారులను కలిసి విన్నవించుకోవటానికి ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఇంకా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకపోతే వారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అర్హులైనా తమను గుర్తించలేదని భావిస్తే వారు తిరిగి తమ అర్హతలను రుజువు చేసుకోవటానికి అవకాశం కల్పించింది.
➧ పథకానికి రేషన్ కార్డు అర్హతగా తీసుకుని అర్హుల జాబితా ఒకటి రూపొందించారు.
➧ తెల్ల రేషన్‌కార్డు, ఆధార్, తల్లి బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ సక్రమంగా ఉంటే వారిని అర్హుల జాబితాలో చేర్చారు.
➧ రెండోది విత్‌హెల్డ్ జాబితా. దీనిలో ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయిర్స్ పిల్లలు వస్తారు. వీరికి పథకం సాయం వర్తించదు.
➧ మూడోది రిక్వెస్ట్ ఫర్ రీ వెరిఫికేషన్ దరఖాస్తు చేసే సమయానికి రేషన్, ఆధార్‌కార్డులు కనిపించలేదని చెప్పేవారిని మూడో జాబితాలో చేర్చారు.
➧ అర్హుల జాబితాను శనివారం ప్రదర్శించారు. ఈ జాబితాలో పేర్లు లేకపోయినా, పేర్లు తప్పుగా ముద్రించినా వెంటనే చూసి వాటిపై తిరిగి అధికారులను సంప్రదించి సరిచేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ మూడు జాబితాలు నేరుగా ఎంఈఓ కార్యాలయంలోనే అందుబాటులో ఉంటాయి.
సామాజిక గణన
➧ ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా అర్హుల జాబితాను రూపొందించింది. దాన్ని ఈనెల 28 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రతి గ్రామ సచివాలయం వద్ద అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, దానిపై ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం సామాజిక తనిఖీలు చేస్తుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
➧ సామాజిక తనిఖీకి ఐదు రోజులు సమయమిచ్చారు. ఈ వ్యవధిలో అర్హుల జాబితాలో ఏమైనా తప్పులు ఉన్నా, అక్రమాలు చోటుచేసుకున్నా సామాజిక ఆడిట్ బృందాల దృష్టికి తీసుకురావొచ్ఛు వాటిని సంబంధిత అధికారులు గ్రామాల్లోనే ధ్రువీకరించుకుని వారు అర్హుల కాదా అని తేల్చి తుది జాబితాను తయారుచేస్తారని అధికారులు చెప్పారు.
Join My whatsapp Group
























No Comment to " అమ్మఒడికి మరో అవకాశం "