మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ - త్వరలో జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి ?
మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ !
త్వరలో జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి ?మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం త్వరలో శుభవార్త వినిపించనుంది. చానాళ్లుగా వారు చేస్తున్న డిమాండ్ మేరకు వారికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుత నిబంధనల ప్రకారం జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో 90 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, 10 శాతం బోధనేతర ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే ఈ నిబంధనలను సవరించి ఇకపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 50 శాతం, బోధనేతర ఉద్యోగులకు 10 శాతం ఇచ్చి.. మిగిలిన 40 శాతం పోస్టులను స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారిని దీనికి అర్హులుగా గుర్తించనున్నారు. పురపాలక శాఖ త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేస్తుందని సమాచారం.
ANDHRA PRADESH INTERMEDIATE EDUCATION SERVICE RULES
Intermediate Education – A.P.I.E.S.(Rules-Method of appointment to the post of Junior Lecturers and
Physical Directors in Government Junior Colleges- Amendment to the Andhra Pradesh Intermediate
Education service rules-Orders-issued.
No Comment to " మున్సిపల్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ - త్వరలో జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి ? "