నిత్యం ఈ పని చేస్తే చాలు మీ ఆరోగ్యానికి వస్తుంది గ్యారంటి..
నిత్యం ఈ పని చేస్తే చాలు మీ ఆరోగ్యానికి వస్తుంది గ్యారంటి..
చాయ్,టీ.పేరు ఏదైన దీని రూపం ఒకటే
సాధారణంగా మనిషికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే టీ గురించి సినిమాల్లో పాటలు
కూడ వున్నాయి.చాయ్ చటుక్కున తాగరా భాయ్ అంటు చిరంజీవి గారు పాడిన పాట ఎంత
ఫేమస్సో మీకు తెలుసు.ఇక టీ లేదా కాఫీ సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు
తాగుతాం.అందువల్ల మైండ్ ప్రశాంతంగా ఉండటంతో పాటు రిలీఫ్ గా కూడా
అనిపిస్తుంది.అయితే ఈ చాయ్‌లో మాచా టీ అని ఒకటుందని తెలుసా,ఈ మాచా టీ వల్ల
మానసిక సమస్యలు,ఒత్తిడి దూరం అవుతాయట. అందుకే దీన్ని రెగ్యూలర్‌గా తాగడం
అలవాటు చేసుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు.ఇక జపనీయులు తాగే మాచా టీ తాగితే
ఒత్తిడి,ఆందోళన,మానసిక సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని పరిశోధనల్లో
వెల్లడైందట..
మాచా టీలో ఉంటే ఔషధ కారకాలు మన శరీరంలోని
డోపమైన్,సెరటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట.అందువలనే మాచా టీ
తాగిన వెంటనే మనసు రిలాక్స్‌గా అనిపిస్తుంది.మానసిక సమస్యలతో బాధపడేవారు
రోజూ ఓ కప్పు మాచా టీ సేవిస్తే మంచిదని శాస్త్రవేత్తలు
సూచిస్తున్నారు.కెమెలియా సినెన్సిస్ అనే మొక్క ఆకుల నుంచి తయారు చేసే ఈ టీ
పొడి మనకు గ్రీన్ టీ రూపంలో దర్శనమిస్తుంది.మనకు ఈ టీ కొత్తదే కానీ,చైనా,
జపాన్‌లలో కొన్ని వందల ఏళ్ల కిందటి నుంచే ఈ టీని తాగుతున్నారట.ఈ టీ
సాధారణంగా మనం తరచూ తాగే టీ కన్నా స్ట్రాంగ్‌గా ఉంటుందని చెబుతున్నారు.ఇంత
మంచి మాచా టీ తాగడం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో తెలుసుకుందాం..1. మాచా టీలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.కాబట్టి మన శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నివారించి, హానికారక ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి.
2. మాచా టీ తాగడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చు.అంతే కాకుండా రక్తంలో ఉన్న ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ పోయి,మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతుంది.అందువల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.బరువు కూడా తగ్గుతారు.
3. లివర్‌లో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలోనూ,నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను తగ్గించడంలో మాచా టీ ఉపయోగపడుతుంది.లివర్ చెడిపోయేందుకు కారణమయ్యే పలు ఎంజైమ్‌లు నశించడంతో పాటు,కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
4. మాచా టీలో ఈజీసీజీ అనే పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి క్యాన్సర్ కణాలకు విరుగుడుగా పనిచేస్తాయి.క్యాన్సర్‌ను తగ్గించడంలో సహాయం చేస్తాయి.ప్రోస్టేట్, స్కిన్, లివర్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
5. మాచా టీని 2 నెలల పాటు వరుసగా రోజూ తాగుతుంటే మెదడు పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.ముఖ్యంగా పెద్దల్లో వయస్సు మీద పడుతున్న కొద్దీ వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని,మెదడు యాక్టివ్‌గా ఉంటుందని,చురుగ్గా పనిచేస్తారని సైంటిస్టులు చెబుతున్నారు.
6. ఈ టీలో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి నోట్లో పెరిగే బాక్టీరియాను నిర్మూలిస్తాయి.దీని వల్ల దంతాలు,చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండి అవి దృఢంగా మారుతాయి.
చూసారు కదా ఈ మాచా టీ వల్ల లాభాలు.ఇంటిదగ్గరే ఆరోగ్యాన్నిచ్చే ఔషధాన్ని సేవించి ఆరోగ్యంగా ఉంటారా.లేదా అనారోగ్యాలను ఆహ్వనించి హస్పిటల్స్‌ను విజిట్ చేస్తారా.మీ యిష్టం..
No Comment to " నిత్యం ఈ పని చేస్తే చాలు మీ ఆరోగ్యానికి వస్తుంది గ్యారంటి.. "