అనుమతిలేని సాంకేతిక విద్యాసంస్థలు 264
అనుమతిలేని సాంకేతిక విద్యాసంస్థలు 264 * ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 35* తెలుగు రాష్ట్రాల్లో 8 ఆర్కిటెక్చర్ కళాశాలలకూ అనుమతులు లేవు
ఈనాడు, దిలీ: దేశవ్యాప్తంగా యూజీసీ, ఏఐసీటీఈ అనుమతులు లేని విద్యాసంస్థలు 380 ఉన్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. రాజ్యసభలో జూన్ 27న ఆయన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొత్తం అనుమతులు లేనివాటిలో 264 సాంకేతిక, 116 ఆర్కిటెక్చర్ కాలేజీలున్నట్లు చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 35 సాంకేతిక విద్యాసంస్థలు ఉన్నట్లు తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 ఆర్కిటెక్ట్ విద్యాసంస్థలకు అనుమతులు లేవన్నారు. వీటి వివరాలు ఏఐసీటీఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. సంస్థ ఆదేశాల మేరకు ఈ విద్యాసంస్థలపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏపీలో అనుమతిలేని సంస్థలు
1. బల్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం
2. సిగ్‌మ్యాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఇక్ఫాయ్ యూనివర్శిటీ, త్రిపుర), విజయవాడ
3. సిగ్‌మ్యాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఇక్ఫాయ్ యూనివర్శిటీ, త్రిపుర), విశాఖపట్నం
4. ఇండో అమెరికన్ టూరిజం లిమిటెడ్, విశాఖపట్నం
5. మాగ్నస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, వైజాగ్
6. సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, విశాఖపట్నం
7. వెంకట్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మొగల్రాజపురం కేవ్స్
తెలంగాణలో అనుమతిలేని సంస్థలు
1. ఆడంస్మిత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, పంజాగుట్ట, హైదరాబాద్
2. అమిటీ బిజినెస్ స్కూల్ హైదరాబాద్, బంజారాహిల్స్, హైదరాబాద్
3. ఏసియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
4. భద్రుకా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్‌ట్రేడ్, కాచిగూడ, హైదరాబాద్
5. బెంగళూరు స్కూల్ ఆఫ్ బిజినెస్, పంజాగుట్ట, హైదరాబాద్
6. క్లినికల్ రీసెర్చి ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ అకాడమీ, బంజారాహిల్స్, హైదరాబాద్
7. సీఎంఈడీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, నారాయణగూడ, హైదరాబాద్
8. సిగ్‌మ్యాక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఇక్‌ఫాయ్ యూనివర్సిటీ, త్రిపుర), వెంగళరావునగర్, హైదరాబాద్
9. గండికోట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, సికింద్రాబాద్
10. జెమ్స్ బిజినెస్‌స్కూల్, అబిడ్స్, హైదరాబాద్
11. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్, బంజారాహిల్స్, హైదరాబాద్
12. ఐఐఎల్‌ఎం బిజినెస్ స్కూల్, హైదరాబాద్
13. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్, బంజారాహిల్స్, హైదరాబాద్
14. ఇండిగో స్కూల్ ఆఫ్ బిజినెస్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్
15. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ క్రియేటివ్ స్టడీస్, జూబ్లీహిల్స్
16. ఇండిగ్రో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్, అమీర్‌పేట్, హైదరాబాద్
17. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్, నల్లకుంట, హైదరాబాద్
18. ఐఎస్‌ఐటెక్ బిజినెస్ స్కూల్, మియాపూర్, హైదరాబాద్
19. ఐటీఎం బిజినెస్ స్కూల్, నల్లకుంట, హైదరాబాద్
20. ఐటీఎం బిజినెస్ స్కూల్ హిందీ మహావిద్యాలయ క్యాంపస్, నల్లకుంట, హైదరాబాద్
21. మాగ్నస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, బంజారాహిల్స్, హైదరాబాద్
22. మహర్షి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బేంగంపేట, హైదరాబాద్
23. మెంటోరిస్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, బంజారాహిల్స్, హైదరాబాద్
24. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్, హైదరాబాద్
25. న్యూ డైమెన్షన్స్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, సోమాజిగూడ, హైదరాబాద్
26. నీరజ్ ఇంటర్నేషనల్ కాలేజి, బేగంపేట, హైదరాబాద్
27. రాయ్ బిజినెస్ స్కూల్, బాలానగర్, హైదరాబాద్
28. స్కూల్ ఫర్ మేనేజ్‌మెంట్ అండ్ అప్లైడ్ రీసెర్చి టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెరీర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, సంతోష్‌నగర్‌కాలనీ, హైదరాబాద్
29. సుజనా స్కూల్ ఆఫ్ బిజినెస్, హైటెక్‌సిటీ, హైదరాబాద్
30. సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, క్రాస్‌రోడ్స్, హైదరాబాద్
31. సినర్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్
32. ద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్‌బీ క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్
33. టోమో టెక్నిసిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌ఆర్‌నగర్, హైదరాబాద్
34. యునైటెడ్ వరల్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, బంజారాహిల్స్, హైదరాబాద్
35. డబ్ల్యూఎల్‌సీ కాలేజ్ ప్రైవేట్ లిమిటెడ్, బంజారాహిల్స్, హైదరాబాద్
అనుమతిలేని ఆర్కిటెక్ట్ కాలేజీలు
1. సీఎస్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెస్లీ బాయ్స్ డిగ్రీ క్యాంపస్, సికింద్రాబాద్
2. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
3. ఎస్‌ఏఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆగిరిపల్లి, కృష్ణాజిల్లా
4. మాస్టర్‌జీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హన్మకొండ, వరంగల్
5. వైష్ణవీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, మాదాపుర్, హైదరాబాద్
6. స్కూల్ ఆఫ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం), రుషికొండ, విశాఖపట్నం
7. మాస్టర్‌జీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాదాపుర్, హైదరాబాద్
8. డెక్కన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, దారుస్సలాం, నాంపల్లి, హైదరాబాద్
No Comment to " అనుమతిలేని సాంకేతిక విద్యాసంస్థలు 264 "