News Ticker

Menu

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

మార్కులు 10 - నైపుణ్యాలు 4

ఎంత సన్నద్ధమైనా ఎంతో కొంత భయాన్ని మిగులుస్తుంది ఆంగ్లం. పరిధి విస్తృతంగా ఉండటమే ఇందుకు కారణం. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మౌలికాంశాలను వేగంగా మననం చేసుకొని వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేస్తే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు.
జనరల్‌ ఇంగ్లిష్‌ పరిధి చాలా పెద్దది. ఈ విభాగం ద్వారా భాషకు సంబంధించిన నాలుగు ప్రాథమిక నైపుణ్యాలను పరీక్షిస్తారు. జనరల్‌ స్టడీస్‌లో దీనికి సంబంధించి కనీసం 10 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలు ఇంగ్లిష్‌ భాషను ఉపయోగించడం, అర్థం చేసుకోవడంలో అభ్యర్థి సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి.
జనరల్‌ ఇంగ్లిష్‌ అంటే వ్యాకరణాంశాలు మాత్రమే కాదు. ఇంకా ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకోవాలంటే స్థూలంగా నాలుగు విభాగాలను అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
అవగాహన సామర్థ్యానికి పరీక్ష
* మొదటిది Reading Comprehension. ఈ విభాగంలోని ప్రశ్నలు వివిధ అంశాలకు సంబంధించి అభ్యర్థుల అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో ఇచ్చే Passage లో ముఖ్య పదజాలం (Key Vocabulary)పై అభ్యర్థి అవగాహనను పరీక్షించే ప్రశ్న ఒకటి ఉంటుంది. దీంతోపాటు Who, What, When, What if, Why, How లాంటి పదాలతో ప్రారంభమయ్యే ప్రశ్నలు ఉంటాయి. చివరగా Passageలో ఇచ్చిన అంశానికి సంబంధించి అభ్యర్థి సామాజిక, వ్యక్తిగత వైఖరులను వెలికితీసే విధంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. Passage సారాంశం గురించి అడిగే ప్రశ్నలపై అభ్యర్థులు దృష్టి సారించాలి.
నియమాల వినియోగం
* రెండోది Grammar. ఈ విభాగంలో వ్యాకరణ నియమాలు (Grammar Rules) నేర్చుకుంటే సరిపోదు. వాటిని సందర్భానుసారంగా ఉపయోగించే నైపుణ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి. వ్యాకరణానికి సంబంధించి Parts of Speech, Model Verbs, Syntax, Tag Questions, Use of Conjunctions, Transformation of Sentences, Tenses, Articles, Prepositions, Clauses; Simple, Compound and Complex Sentences, If conditionals, Sentence correction, Voice of verbs, Use of linkers, Direct and Indirect speech తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ వ్యాకరణాంశాలకు సంబంధించిన నియమాలను కాకుండా వాటిని ఉపయోగించడంలో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.
పద ప్రయోగాలు
* మూడోది Vocabulary. ఈ విభాగంలో Contextual Synonyms, Antonyms, Phrasal Verbs, Idiomatic expressions, Foreign expressions, One word substitutions, Word meaning in a context, Word family, Use of Suffixes and Prefixes లాంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. Reading Comprehension విభాగంలో కూడా Vocabulary కి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఈ విభాగంలోని ప్రశ్నలు అభ్యర్థుల పద ప్రయోగ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి.
భాషపై పట్టు
* నాలుగోది Conventions of writing.ఈ విభాగంలో భాషను రాసే క్రమంలో అభ్యర్థులకు ఉండాల్సిన నైపుణ్యాలను పరీక్షిస్తారు. ప్రధానంగా spelling, use of capital letters, punctuation, paragraph organisation, use of short forms and contractions, abbreviations, text genre అంశాలను సిలబస్‌గా పరిగణించాలి. వీటిని ఉపయోగించే సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలి.
ఎలా ప్రిపేర్‌ కావాలి?
* జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ప్రణాళికా బద్ధంగా చదవాలి. ప్రిపరేషన్‌ను Grammar తో ప్రారంభించాలి. మొదట Tenses తర్వాత Transformation of sentences పై దృష్టి సారించాలి. మిగతా అంశాల్లో ప్రాథమిక అవగాహనను కలిగి ఉండాలి. రోజులో కొంత సమయం Vocabulary కి కేటాయించాలి. Synonyms, Antonyms, Phrasal verbs, Idiomatic expressions ను తప్పనిసరిగా సాధన చేయాలి.
* Reading comprehension విభాగంలో higher order thinking కి సంబంధించిన Passages ను రోజుకు ఒకటి చొప్పున ప్రాక్టీస్‌ చేయాలి. మొత్తం మీద పది Passage లను సాధన చేస్తే సరిపోతుంది.
* Conventions of writing లో spelling, capitalisation పై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యమైన పదాల spellings నేర్చుకుంటే సరిపోతుంది. punctuation లో comma, inverted comma ను direct speech వాక్యాల ఆధారంగా ప్రాక్టీస్‌ చేయాలి.

* 2018-19లో జరిగిన టెట్‌లో ఇచ్చిన జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించిన ప్రశ్నలను సాధన చేయడం వల్ల మెరుగైన అవగాహన ఏర్పడుతుంది. 8, 9, 10, జూనియర్‌ ఇంటర్‌ టెక్ట్స్‌ బుక్స్‌లో ఉండే అంశాలను సాధన చేయాలి.


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM