News Ticker

Menu

AP SSC Class 10 SA 1, Public Exam Question Paper New Pattern

AP SSC Class 10 SA 1, Public Exam Question Paper New Pattern

సర్కారు ఆమోదానికి ముసాయిదా
🔹ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపు, పరీక్ష కాలవ్యవధి.. తదితర సంస్కరణలతో రూపొందించిన ముసాయిదాను పాఠశాల విద్యా కమిషనరేట్‌ సర్కారుకు పంపించింది. ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే ఈ ఏడాది నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది.
మల్టిపుల్‌ కు గుడ్‌బై

  • టెన్త్‌ పేపర్లలో ఏ,బీ,సీ,డీలకు చెల్లు
  • ఇక అన్నీ రాతపూర్వక సమాధానాలే
  • ప్రధాన ప్రశ్నపత్రంలోనే బిట్‌ పేపర్‌
  • మార్కుల లెక్కింపు విడివిడిగా
  • ఒక్కొక్క పేపర్‌లోనూ 18 వస్తేనే పాస్‌
  • మదింపులోనూ భారీ వడపోత
  • పరీక్ష సమయం 15 నిమిషాల పెంపు
  • పది పరీక్షల్లో కీలక సంస్కరణలు
  • ప్రభుత్వ పరిశీలనకు ముసాయిదా
  • ఓకే అంటే ఈ ఏడాది నుంచే అమలు
♦పదో తరగతి పరీక్ష విధానంలో సంస్కరణలకు ప్రభుత్వం తెరదీసింది. ఇక నుంచి ప్రశ్నపత్రం స్వరూపం మారబోతోంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో భాగంగా గత మూడేళ్లుగా అమలు చేసిన అంతర్గత మార్కుల పద్ధతిని ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో ప్రశ్నావళి సరళిలో పలు మార్పులు తెచ్చారు. గతంలో మెయిన్‌ పేపర్‌.. బిట్‌ పేపర్‌ విడివిడిగా ఉండేవి. ఇకపై మెయిన్‌ పేపర్‌లోనే బిట్లు కూడా కలిసే ఉంటాయి. పాత మోడల్‌లో బిట్‌ పేపర్‌లో ఏ, బీ, సీ, డీ.. మల్టిపుల్‌ చాయి్‌సతో కొన్ని ప్రశ్నలు ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో లక్ష్యాత్మక ప్రశ్నలు ఇస్తారు. అంటే విద్యార్థి ప్రతి ప్రశ్నకు కనీసం ఒకటి లేదా రెండు పదాలతో కూడిన సమాధానం రాయాలి. పలు మార్పులతో కూడిన ప్రశ్నపత్రంతో పాటు విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఒక ముసాయిదా(బ్లూప్రింట్‌)ను పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్‌ సిద్ధం చేసింది. దీని ప్రకారం.. 2019-20 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండవని స్పష్టమైంది.

మార్కుల్లో మార్పు లేదు
 🔸ప్రశ్న పత్రంలో మార్పులు జరిగినా.. మార్కుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. ప్రతి సబ్జెక్టులోనూ 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టులో రెండు పేపర్లు 50 మార్కుల చొప్పున ఉంటాయి. హిందీలో మాత్రం ఒకే పేపర్‌ 100 మార్కులకు నిర్వహిస్తారు. గతంలో మాదిరిగానే ఆరు సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 600 మార్కులకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. పాత విధానంలో ఆయా సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లలో కలిపి(ఒకదాంట్లో 20, మరో దాంట్లో 15 చొప్పున వచ్చినా) 100 మార్కులకు 35 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టు ప్రకటించారు. కానీ, ఇప్పుడు ప్రతి పేపర్‌లోనూ 18 మార్కులు సాధిస్తేనే పాస్‌ అయినట్లు ప్రకటిస్తారు. ఉదాహరణకు సైన్స్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన రెండు పేపర్లలో ఒకదాంట్లో 20 మార్కులు వచ్చి, రెండో పేపర్లో 15 వచ్చినా.. పాసైనట్టు పరిగణించరు. ఖచ్చితంగా రెండు పేపర్లలోనూ 18+18 రావాల్సిందే. ఇక, ప్రశ్నపత్రంలో 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులతో కూడిన ప్రశ్నలు ఉంటాయి.
32 ప్రశ్నలు.. 50 మార్కులు
🔹1/2 మార్కు ప్రశ్నలు 12. వీటికి 6 మార్కులు(పాత విధానంలో 1/2 మార్కు ప్రశ్నలు 20 ఉండేవి). 1 మార్కు ప్రశ్నలు 8. వీటికి 8 మార్కులు ఉంటాయి. 2 మార్కుల ప్రశ్నలు 8. వీటికి 16 మార్కులు. 4 మార్కుల ప్రశ్నలు 5. వీటికి 20 మార్కులు.

అన్నీ రాయాల్సిందే
🔹ప్రశ్న పత్రానికి సంబంధించి అన్ని సమాధానాలను విద్యార్థి రాత పూర్వకంగానే పేర్కొనాలి. 1/2 మార్కు ప్రశ్నకు ఒక పదంతో, 1 మార్కు ప్రశ్నకు ఒకటి లేదా రెండు వాక్యాల్లో, 2 మార్కుల ప్రశ్నకు మూడు నుంచి 4 వాక్యాల్లో, 4 మార్కుల ప్రశ్నకు ఆరు నుంచి 8 వాక్యాల్లో సమాధానం రాయాలి.*
15 నిమిషాల పెంపు

🔸పాత విధానంలో పరీక్ష సమయం 2.30 గంటలు ఉండేది. కొత్త విధానంలో మరో 15 నిమిషాలు పెంచారు. దీంతో పరీక్ష సమయం 2.45 గంటలు ఉంటుంది. అయితే, కాంపోజిట్‌ తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలకు 3 గంటల సమయం ఇస్తారు. కాగా, ఈ పేపర్లను 70 మార్కులకే నిర్వహిస్తారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " AP SSC Class 10 SA 1, Public Exam Question Paper New Pattern "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM