ఇప్పుడు తుపాను ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా?
ఇప్పుడు వాయుగుండం ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా?
*ఏపీపై అసని తుపాను ప్రభావం,అసాని తుఫాన్ హెచ్చరిక...
ప్రస్తుతం విశాఖకు 450 కి.మీ దూరంలో గంటకు 20 కి.మీ.ల వేగంతో ఈ తుపాను పయనిస్తోంది. రేపట్నుంచి వర్షాలు మొదలై 11వ తేదీ ఉదయానికి వర్షాలు ఎక్కువవుతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ తుపాను విశాఖ సమీపానికి చేరిన తర్వాత తిరిగి ఒడిశా వైపుగా పయనిస్తూ అక్కడి తీరంలోనే బలహీనపడే అవకాశాలున్నాయని తుపాను కేంద్రం అధికారులు తెలిపారు. ఈ సమాచారం సోమవారం సాయంత్రం 4.30 గంటలకు తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
అలాగే తుపాను వల్ల రేపు ఉదయం నుంచి రెండు రోజుల పాటు ఉత్తర కోస్తాలో వర్షాలు ఎక్కువగా పడే అవకాశముందని అధికారులు చెప్పారు.
విశాఖలో తీరం వెంబడి ప్రస్తుతం 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి జిల్లాపై ఈ తుపాను ప్రభావం కనిపిస్తుంది.
తుపాను దిశ మార్చుకున్నాకే గాలి తీవ్రత తగ్గుంతుంది . ఈ గాలులు మూడు రోజుల పాటు ఉంటాయి.
విశాఖ నుంచి తుని వరకు వాతావరణం ఉదయం నుంచి చల్లబడింది. కొన్ని చోట్ల చినుకులు పడుతున్నాయి. గాలుల ప్రభావం కనిపిస్తోంది. సముద్రంలో అలల తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
తీరం వైపు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు ఎక్కడికక్కడ బారికెడ్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 0891-2590100, 101, 102 నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అలాగే విశాఖ రెవెన్యూ సిబ్బంది అందరినీ క్షేత్రస్థాయిలో అలెర్ట్‌గా ఉండాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ ఆదేశాలు జారీ చేశారు.
రేపటి నుంచి 12వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తుని, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. అలాగే విశాఖ నుంచి కాకినాడ వరకు అతిభారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి” .
“అలాగే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయి. తుపాను ప్రభావిత ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో రేపు ఉదయం 5 గంటల నుంచి వర్షాలు పడతాయి.
అసాని తుపాను ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మధ్య ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో... దీనిని ఎదుర్కొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధమైంది.
తుపాను సమయంలో ఏదైనా ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఐసీజీఎస్ వీర, 20 మంది కోస్ట్ గార్డ్ సిబ్బందితో ఐదు విపత్తు సహాయ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తూర్పు నౌకాదళం అధికారులు తెలిపారు.
ఇంకా సముద్రంలోనే వేటలో ఉన్న మత్స్యకారులను వెనక్కి రమ్మన్ని నావికా దళ సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు.
No Comment to " ఇప్పుడు తుపాను ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా? "