ఈ నెల 14 నుంచి పాఠశాలల్లో "కెరీర్ వీక్"
ఈ నెల 14 నుంచి పాఠశాలల్లో "కెరీర్ వీక్"
ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, కార్పొరేషన్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు కోర్సులు, జీవితంలో స్థిరపడేందుకు ఎంచుకోవాల్సిన కెరీర్ గురించి అవగాహన కల్పించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. పాఠశాలల్లో కెరీర్ గైడెన్సుపై ఉన్నత ఉపాధ్యాయులకు డైట్ అధ్యాపకులు, ప్రత్యేక రిసోర్సు పర్సన్లు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు . ఈ ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు కెరీర్ పై మార్గదర్శనం చేస్తారు. ఈ నెల 14 నుంచి 19 వరకు 'కెరీర్ వీక్' నిర్వహించనున్నారు. ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో 9, 10 తరగతుల విద్యార్థులకు రోజూ రెండు పీరియడ్లు కెరీర్ పై అవగాహన కల్పిస్తారు. 14న ముందుస్తు పరీక్ష, 19న తుది పరీక్ష నిర్వహించి వారి ప్రత్యేక సామర్థ్యాల్ని అంచనా వేస్తారు. వీటి ఆధారంగా వారు ఏ కెరీర్లో రాణించే అవకాశం ఉందో తెలియజేస్తారు. దీనికి సంబంధించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక బోధన సామగ్రి పంపారు.
కార్యక్రమం..:
• ఈ నెల 14 న విద్యార్థి కుటుంబంలో ఉన్న వృత్తులు, రోల్ మోడల్ గురించి చెప్పి ముందస్తు పరీక్ష నిర్వహణ.
• 15న విద్యార్థి బలాలు, వాటిని ఉపయోగించుకునే విధానం, అతనికి ఇష్టమైన కెరీర్ ను అంచనా వేసి సొంతంగా అవగాహ పొందే విధంగా మార్గదర్శనం.
• 16న హాల్యాండ్ కెరీర్ కోడ్ పరీక్ష నిర్వహణ.
• 17న వృత్తులకు సంబంధించిన, విద్యాపరమైన సమాచారం, జాబ్ కార్డులు, కెరీర్ ను ఎంచుకునే విధానం గురించి చెబుతారు.
• 18న విద్యార్థి భవిష్యత్తు ప్రణాళిక, తన ప్రత్యేకను చాటుకునే విధానంపై వివరిస్తారు.
• 19న కెరీర్ డే వేడుకలు నిర్వహిస్తారు. ఉదయం వ్యాసరచన, వక్తృత్వం, తాను ఎంచుకున్న కెరీర్ కు అనుగుణమైన దుస్తులు ధరించటం. 'నా కెరీర్ - నా ఎంపిక' అనే అంశంపై రెండు నిమిషాల వీడియోను సంబంధిత విద్యార్థితో చేయిస్తారు. అదేరోజు రెండో పూట అతిథి ఉపన్యాసాలు, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Day Wise Schedule & Guidelines
APGLI Bond maturity Value & bonus - Policy details
Join My whatsapp Group
























No Comment to " ఈ నెల 14 నుంచి పాఠశాలల్లో "కెరీర్ వీక్" "