News Ticker

Menu

గూగుల్‌ అలర్ట్‌.. ఫోన్‌ నుంచి కొద్ది కొద్దిగా పైసలు గాయబ్‌, యాప్స్‌ లిస్ట్‌ ఇదే! - 136 యాప్స్‌ను నిషేధించినట్లు గూగుల్‌ ప్రకటించింది.

 

గూగుల్‌ అలర్ట్‌.. ఫోన్‌ నుంచి కొద్ది కొద్దిగా పైసలు గాయబ్‌, యాప్స్‌ లిస్ట్‌ ఇదే!

Google Ban 136 Malicious Apps: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులకు హెచ్చరిక. ప్లేస్టోర్‌ నుంచి 136 యాప్స్‌ను నిషేధించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఈ యాప్స్‌ ద్వారా ప్రమాదకరమైన మాల్‌వేర్‌ ను ప్రయోగించి.. హ్యాకర్లు 70 దేశాల ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్ల నుంచి భారీగా నగదు కొల్లగొట్టినట్లు సమాచారం. తమ ప్రమేయం లేకుండా యూజర్లు కొద్దికొద్దిగా డబ్బును పొగొట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూజర్లు అర్జెంట్‌గా తమ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని గూగుల్‌ సూచించింది.

యాప్స్‌ ద్వారా మాల్‌వేర్‌ దాడులతో హ్యాకర్లు తెలివిగా ఒకేసారి కాకుండా.. కొంచెం కొంచెంగా డబ్బును మాయం చేస్తున్నారట. డల్లాస్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ 'జింపేరియమ్‌' ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 136 యాప్స్‌ మీద నిషేధం విధించింది గూగుల్‌. ఇంకా గూగుల్‌ప్లే స్టోర్‌ నుంచి తొలగించని ఈ యాప్స్‌ను.. ఫోన్‌ వాడకందారులే అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలని సూచిస్తోంది. ఒకవేళ యాప్స్‌ తొలగించినప్పటికీ.. థర్డ్‌పార్టీ యాప్‌ మార్కెట్‌ ప్లేస్‌తోనూ నడిచే అవకాశం ఉందని, కాబట్టి యాప్స్‌ను తీసేయాలని గూగుల్‌ సూచిస్తోంది.

బ్యాన్‌ చేసిన యాప్స్‌లో పాపులర్‌ యాప్స్‌ సైతం కొన్ని ఉండడం విశేషం. ఐకేర్‌-ఫైండ్‌ లొకేషన్‌, మై చాట్‌ ట్రాన్స్‌లేటర్‌, జియోస్పాట్‌: జీపీఎస్‌ లొకేషన్‌ ట్రాకర్‌, హార్ట్‌ రేట్‌ అండ్‌ పల్స్‌ ట్రాకర్‌, హ్యాండీ ట్రాన్స్‌లేటర్‌ ప్రో లాంటి యాప్స్‌ సైతం ఉన్నాయి. గ్రిఫ్ట్‌హోర్స్‌ ఆండ్రాయిడ్‌ ట్రోజన్‌ మొబైల్‌ ప్రీమియం సర్వీస్‌ ద్వారా దాదాపు కోటి మంది ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫోన్లను హ్యాకర్లు టార్గెట్‌ చేశారని జింపేరియమ్‌ జీల్యాబ్‌ గుర్తించింది. ఫిషింగ్‌ టెక్నిక్‌లు, గిఫ్ట్‌ల పేరుతో టోకరా , తెలియకుండానే డాటాను తస్కరించడం లాంటి యాక్టివిటీస్‌ ద్వారా ఇప్పటికే భారీగా చోరీ చేయగా.. ఆండ్రాయిడ్‌ యూజర్లు కింద పేర్కొన్న యాప్స్‌ గనుక ఫోన్లలో ఉంటే.. వాటిని తొలగించాలని చెబుతోంది. 

Apps List 

DIKSHA - LINK TO WATCH LIVE TRAINING PROGRAMME ON - "DAY -2


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " గూగుల్‌ అలర్ట్‌.. ఫోన్‌ నుంచి కొద్ది కొద్దిగా పైసలు గాయబ్‌, యాప్స్‌ లిస్ట్‌ ఇదే! - 136 యాప్స్‌ను నిషేధించినట్లు గూగుల్‌ ప్రకటించింది. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM