News Ticker

Menu

ANGANWADI COLOCATED SCHOOLS LIST

 నూతన విద్యావిధానంపై సీఎం సమీక్ష

ఈనెల 16న పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యాకానుక


క్యాంపు కార్యాలయంలో నూతన విద్యావిధానంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారుచేసిన ప్రతిపాదనలు వివరించిన అధికారులు.


నూతన విద్యావిధానం స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరణ ఖరారు.


1) శాటిలైట్‌ స్కూల్స్‌ ( పీపీ–1, పీపీ–2)

2) ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2. 1, 2)

3) ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌  ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)

4) ప్రీ హైస్కూల్స్‌  ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)

5) హైస్కూల్స్‌ ( 3 నుంచి 10వ తరగతి వరకూ )

6) హైస్కూల్‌ ప్లస్‌  (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ)

పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణవల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌  44వేల నుంచి 58వేల స్కూల్స్‌ అవుతాయని వివరించిన అధికారులు.

ఈ వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలి: సీఎం

విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలి: సీఎం

టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలి: సీఎం

వివిధ తరగతుల్లో ఉన్న సబ్జెక్టులు, వాటి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం
ఆర్టీఈ నిబంధనలను అనుసరిస్తున్నామని తెలిపిన అధికారులు.

ఆ నిబంధనలను పాటిస్తూనే... 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో విషయ నిపుణులైన టీచర్లద్వారా చక్కటి బోధన అందించడానికి తగిన సంఖ్యలో టీచర్లను పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం

నూతన విద్యా విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారు : సీఎం

ఇంగ్లిషు మీడియంలో బోధన అందుతుంది:

ప్రపంచస్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులు తయారు అవుతారు:

చిన్ననాటినుంచే వారికి నైపుణ్యం ఉన్న టీచర్లు అందుబాటులో ఉంటారు:

సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలోకూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయి:

దీనివల్ల ఉపాధ్యాయులపై పనిభారం కూడా తగ్గుతుంది:

అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుందన్న సీఎం.

తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం ఆదేశం.

నూతన విద్యావిధానం,
నాడు –నేడుల కోసం మొత్తంగా సుమారు
రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న సీఎం.

నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని సీఎం ఆదేశం

ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలన్న ముఖ్యమంత్రి

నూతన విద్యా విధానం ఉద్దేశాలను వారికి వివరంగా తెలియజేయాలన్న సీఎం

నూతన విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాలన్న సీఎం

దీనిపై ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న సీఎం

పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 16న విద్యాకానుక ప్రారంభం, హాజరుకానున్న సీఎం

విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల వల్ల మంచి ఫలితాలు:

అమ్మ ఒడి, ఇంగ్లిషు మీడియం, నాడు – నేడు తదితర విప్లవాత్మక మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని సీఎంకు వివరించిన అధికారులు.

2014–15 నాటికి రాష్ట్రంలోని అన్నిరకాల స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ 72.33 లక్షలు కాగా 2018–19 నాటికి అది 70.43 లక్షలకు పడిపోయిందన్న అధికారులు.

అమ్మ ఒడి పథకం వల్ల 2020–21 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 73.06 లక్షలకుచేరుకుందన్న అధికారులు

2.63 లక్షలమంది పిల్లలు అధికంగా చేరారన్న అధికారులు

అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో 2014–15 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య 42.83 లక్షల మంది
కాగా 2018–19 నాటికి ఆ సంఖ్య 37.21 లక్షలకు పడిపోయింది.

2020–21 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 43.44 లక్షలకు చేరిందని తెలిపిన అధికారులు.

ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం పెరిగిందని, అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపాలన్న కోరిక బలపడిందని తెలిపిన అధికారులు.

అమ్మ ఒడి పథకం ద్వారా స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన డేటా వివరాలు పక్కాగా ఉన్నాయని తెలిపిన అధికారులు.

సామాజిక తనిఖీల ద్వారా ( సోషల్‌ ఆడిట్‌) కచ్చితమైన డేటా రూపొందిందని తెలిపిన అధికారులు.

చదువుకుంటున్న పిల్లలకు సంబంధించిన వివరాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇంత పక్కాగా లేవని తెలిపిన అధికారులు

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌,
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Download

Ed first English Training - Google link for 10 thousand teachers -complete by base line survey by tomorrow evening.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ANGANWADI COLOCATED SCHOOLS LIST "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM