News Ticker

Menu

పదవ తరగతి పరీక్షలు 2020 & 2021 కు సంబంధించి ఫలితాలు ప్రకటించుటకు, మార్కులు, గ్రేడ్లు కొరకు పూర్తి విధివిధానాల ఉత్తర్వులు విడుదల

పదవ తరగతి పరీక్షలు 2020 & 2021 కు సంబంధించి ఫలితాలు ప్రకటించుటకు, మార్కులు, గ్రేడ్లు కొరకు పూర్తి విధివిధానాల ఉత్తర్వులు విడుదల

School Education - SSC Public Examinations, 2020 & 2021 – Cancelled due to COVID Situation in the state – Constitution of High Power Committee to evolve the procedure for declaration of the results of SSC Public Examinations – Final Report Submitted – Approval of Recommendations of the Committee – Orders - Issued.

AP news: ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్ల ఆధారంగా పదోతరగతి ఫలితాలు

అమరావతి: కరోనా వ్యాప్తి కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్ల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. 2020, 2021 పదో తరగతి ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన చేయాలని గతంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఎదురవ్వకుండా 2019-2020 ఏడాదికి పాస్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన విద్యార్థులందరికీ గ్రేడ్‌ పాయింట్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. అంతర్గతంగా 50 మార్కులు చొప్పున నిర్వహించిన 3 ఫార్మెటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ఉండనున్నాయి. అయితే, ఈ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు పాస్‌ గ్రేడ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటికి ఆమోదం తెలుపుతూ పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.



🔷SSC public Exams 2020   లో Grades Award చేయుటకు  SA1 లో మార్కులు 50 కు ,3FA లలో కలిపి మొత్తము మార్కుల 50 కు పరిగణన లోకి తీసుకొని మొత్తము  100 కు ఎన్ని మార్కులు వచ్చిన వో దానిని బట్టి గ్రేఢులు నిర్ణయిస్తారు

❇️SSC Public Exams 2021 లో గ్రేడులు:
 రెండు FA లలో Slip test (20Marks) లో 70%, CCE Marks for Other components(10+10+10) లో 30% మార్కులను కలిపి మొత్తము 100 మార్కులకు పొందిన మార్కుల ఆధారంగా గ్రేడులు ఇస్తారు

🔷No fail .Last Grade ఇవ్వబడును

🔷FA లు వ్రాయని వారికి,లేక ఆ మార్కులు Online చేయని Students కు Last grade ఇచ్చి Pass చేస్తారు

🔷 2020 కు ముందు SSC చదివి 2017,2018,2019  పరీక్షల్లో కొన్ని Subjects Fail అయిన వారికి ఆ Subjects లో Internal marks   ను బట్టి లేక 20 అంతర్గత  మార్కులకు  ఎన్ని వచ్చినా వో వాటిని 5 చే గుణించి 100 కు వచ్చిన మార్కులను బట్టి గ్రేడులు లేక  Last grade  ఇస్తారు.

  Download G.O

 

Share This:

teacherbook.in

No Comment to " పదవ తరగతి పరీక్షలు 2020 & 2021 కు సంబంధించి ఫలితాలు ప్రకటించుటకు, మార్కులు, గ్రేడ్లు కొరకు పూర్తి విధివిధానాల ఉత్తర్వులు విడుదల "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM