Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేయండి ఇలా
Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేయండి ఇలా
ఆధార్ నెంబర్‌లో 12 అంకెలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే 12 అంకెలు ఉన్నంతమాత్రాన అది ఆధార్ నెంబర్ కాదంటోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఉదాహరణకు ఎవరిదైనా ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ నెంబర్ తీసుకున్నట్టైతే ఆ ఆధార్ నెంబర్‌ను వెరిఫై చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. 12 అంకెలు ఉన్నంత మాత్రానా అది ఆధార్ నెంబర్ కాదని, ఈ తరహా ఆధార్ మోసాలు జరుగుతున్నాయని యూఐడీఏఐ అప్రమత్తం చేస్తోంది. ఎవరైనా ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్‌ను వెరిఫై చేయాలని కోరుతోంది. https://uidai.gov.in/ లేదా https://resident.uidai.gov.in/ వెబ్‌సైట్లలో ఆధార్ నెంబర్ వెరిఫై చేయొచ్చు. మరి ఆధార్ నెంబర్‌ను ఎలా వెరిఫై చేయాలో తెలుసుకోండి.
Verify Aadhaar Number: ఆన్‌లైన్‌లో ఆధార్ నెంబర్ వెరిఫై చేయండి ఇలా
ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో My Aadhaar సెక్షన్‌లో Aadhaar services లిస్ట్‌లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
పైన చెప్పిన స్టెప్స్ కాకుండా నేరుగా https://resident.uidai.gov.in/ లింక్ ఓపెన్ చేసినా ఆధార్ వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
అందులో 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Proceed to Verify పైన క్లిక్ చేయాలి.
ఆ ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉందా? లేదా డీయాక్టివేట్ చేశారా? అసలు అది ఆధార్ నెంబరేనా? అన్న విషయం తెలుస్తుంది.
గ్రీన్ టిక్‌తో Aadhaar Number xxxxxxxxxxxx Exists అని కనిపిస్తే ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉన్నట్టే.
Fytu7
ReplyDelete