News Ticker

Menu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 20 రోజుల ప్రత్యేక సాధారణ కరోనా సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

  

ఏపీ ఉద్యోగులకు వర్తించే కోవిడ్ సెలవుల ఉత్తర్వుల జీవో 45 విడుదల

 20 రోజుల సెలవు తీసుకోవచ్చు

2020 మార్చి 25 నుంచే వర్తింపు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 20 రోజుల ప్రత్యేక సాధారణ కరోనా సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో 45 ను గురువారం విడుదల చేశారు.

రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సెలవు విధివిధానాలు ఇలా ఉన్నాయి...

ఉద్యోగికి స్వయంగా కరోనా సోకితే 20 రోజుల వరకు కమ్యుటెడ్ లీవు  ఇస్తారు. ఇందుకు ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించవలసిన అవసరం లేదు. కోవిడ్ పాజిటివ్ అన్న రిపోర్టు  ఆధారంగా ఇది ఇస్తారు. కమ్యుటెడ్ లీవు లేకపోతే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తారు. దీనికి తోడుగా సంపాదిత సెలవు, హాఫ్ డే పే లీవు ఇస్తారు. ఒక వేళ ఈ సెలవులు ఏమీ లేకపోతే అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు.( ఎక్స్ ట్రార్డినరీ లీవు). ఇందుకు ఎలాంటి వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కాలాన్ని సర్వీసులో ఉన్నట్లుగానే పరిగణిస్తారు.

20 రోజుల తర్వాత డ్యూటీకి హాజరు కాలేకపోతే....

ఒక వేళ ఆస్పత్రిలో చేరి 20 రోజుల తర్వాత కూడా విధులకు హాజరు కాలేని పక్షంలో, క్వారంటైన్ లో 20 రోజులు ఉన్న తర్వాతా విధులకు హాజరు కాలేని పక్షంలో   ఆస్పత్రిలో చేరారన్న డాక్యుమెంట్ ఆధారంగా కమ్యుటెడ్ లీవు మంజూరు చేస్తారు.

కోవిడ్ తో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి కోవిడ్ అనంతర సమస్యలతో మరిన్ని రోజులు సెలవు అవసరమైనా మంజూరు చేస్తారు. ఒక వేళ కమ్యుటెడ్ లీవు అతనికి లేకపోతే ప్రత్యేక సాధారణ సెలవు, ఈ ఎల్, లేదా అసాధారణ  సెలవు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉద్యోగి కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే...

రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా వారి తల్లిదండ్రలుకు కోవిడ్  సోకినా దాదాపు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఈ సందర్భంలోను 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుంది. మెడికల్ సర్టిఫికెట్ అక్కర్లేదు. ఒక వేళ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులూ ఆస్పత్రి పాలైతే ఆ 15 రోజుల సెలవు పూర్తయిన తర్వాత ఇంకా అవసరం ఏర్పడితే ఆ ఉద్యోగికి ఉన్న ఏ సెలవు అయినా వినియోగించుకోవచ్చు. ఏ సెలవు వినియోగించుకోలేని పరిస్థితి ఉన్న వారికి ఆ ఉద్యోగి పని చేసే విభాగాధిపతి తగిన నిర్ణయం తీసుకుని సెలవు మంజూరు చేసే అధికారం కల్పించారు. ఆయన నిర్ణయమే ఫైనల్ గా పేర్కొన్నారు.

ఒక వేళ కోవిడ్ సోకిన వారిని ఉద్యోగి కలిస్తే ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లో ఉంటే ఏడు రోజుల పాటు సెలవు లేదా ఇంటి నుంచి పనికి అనుమతిస్తారు. వారు నివసించే ప్రాంతంలో  కంటైన్ మెంట్ జోన్ గా ఉండి విధులకు రాలేకపోయినా వారం రోజుల పాటు సెలవు లేదా వర్కు ఫ్రం హోం వినియోగించుకోవచ్చు.

2020  మార్చి 25 నుంచి ఈ  ఉత్తర్వులు వర్తిస్తాయి.

Download

Share This:

teacherbook.in

No Comment to " ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 20 రోజుల ప్రత్యేక సాధారణ కరోనా సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM