News Ticker

Menu

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్.. రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు..!

 

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్.. రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు..!

మీ దగ్గర ఉన్న డబ్బుల్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? ఆ డబ్బు తో మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది.కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ Kisan Vikas Patra Scheme దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్/ Kisan Vikas Patra Scheme

ంచి రాబడి పొందాలని అనుకునే వాళ్లకి ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. పైగా ఈ స్కీమ్ లో కనుక మీరు డబ్బులు పెట్టారంటే ఆ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ డబ్బును పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేయాలి.

పోస్టాఫీస్‌ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. దీనితో చాలా మంది ఆ స్కీమ్స్ వలన బెనిఫిట్ పొందుతున్నారు. అయితే పోస్టాఫీస్‌లో ఒక అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి.

పైగా దీనిలో ఇన్వెస్ట్ చేయడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి పొందొచ్చు. ఆ స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 124 నెలల్లో రెట్టింపు అవుతాయి. మరి ఇక ఈ స్కీమ్ కి సంబంధించి మరిన్ని వివరాలని చూస్తే..

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ అనేది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఈ స్కీమ్ లో కేవలం ఒకే సారి డబ్బులు పెట్టాలి. తర్వాత మెచ్యూరిటీ సమయంలో ఆ డబ్బుల్ని తీసుకోవాలి. దీనిలో కనుక మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మీకు రూ.2 లక్షలు వస్తాయి.

ప్రస్తుతం ఈ స్కీమ్‌ లో డబ్బులు పెడితే 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ.1000 ఉంటే సరిపోతుంది.. ఇలా ఈ పథకంలో చేరొచ్చు. తద్వారా మంచి రాబడి ఈజీగా పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " కిసాన్ వికాస్ పత్ర స్కీమ్.. రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు..! "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM