కోవిడ్ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పన్ను మినహాయింపు
కోవిడ్ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ : కోవిడ్ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల వరకూ పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ చికిత్స వ్యయంపై ఈ మినహాయింపు లభిస్తుంది. కుటుంబం ఆధారపడిన వ్యక్తి కోవిడ్‌తో మరణిస్తే లభించే పరిహారంపై కూడా పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. 'దురదృష్టవశాత్తూ, కొంత మంది పన్ను చెల్లింపుదారులు కోవిడ్‌తో మరణించారు. వారి కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా పన్ను మినహాయింపును అమలు చేయనున్నాం' అని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్-పాన్ లింక్ గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ పొడిగించారు.
No Comment to " కోవిడ్ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పన్ను మినహాయింపు "