News Ticker

Menu

ఈ ఆహారం తీసుకుంటే హృదయానికి, ఎముకలకు ఎంతో మేలు కలుగుతుంది.

 

ఈ ఆహారం తీసుకుంటే హృదయానికి, ఎముకలకు ఎంతో మేలు కలుగుతుంది..!

హృదయ ఆరోగ్యానికి మరియు ఎముకలు బలంగా ఉండడానికి విటమిన్-కె చాలా ముఖ్యం. విటమిన్ కె ఉండే ఆహారం తీసుకుంటే ఈ సమస్యలు మీకు రావు. అయితే ఈ రోజు విటమిన్ కె మనకు ఎక్కువగా దొరికే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూద్దాం.

కివి:

కివి లో రోగనిరోధకశక్తిని పెంపొందించే గుణాలు ఉంటాయి. అదేవిధంగా పొటాషియం, ఫోలేట్, విటమిన్-కె కూడా ఉంటాయి. 100 గ్రాముల కివి లో 50 mcg విటమిన్-కె ఉంటుంది.

బచ్చలి కూర:

బచ్చలి కూర లో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం హృదయ సంబంధిత సమస్యలు దూరం చేసుకోవడానికి బచ్చలి కూడా ఎక్కువగా తీసుకోండి.

అవకాడో:

అవకాడో లో కూడా విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

పచ్చి బఠాణి:

పచ్చి బఠాణి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ కె కూడా దీనిలో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు దీనిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి.

దానిమ్మ:

దానిమ్మ తీసుకోవడం వల్ల రక్తం ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా విటమిన్ కె కూడా దీనిలో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దీనిని కూడా మీరు డైట్ లో చేర్చుకోవడం మంచిది. తద్వారా హృదయ సంబంధిత సమస్యలు మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలు రావు.

Check RTO eChallan on your Vehicle if any... మీ Vehicle మీద ఏమన్నా Challans ఉన్నాయేమో check చేసుకోండి

 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఈ ఆహారం తీసుకుంటే హృదయానికి, ఎముకలకు ఎంతో మేలు కలుగుతుంది. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM