జగనన్న విద్యా కానుక ఒకటో తరగతి నుంచి టెన్త్ విద్యార్థులకు కిట్స్ 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే పంపిణీ...
జగనన్న విద్యా కానుక
ఒకటో తరగతి నుంచి టెన్త్
విద్యార్థులకు కిట్స్
2021-22 విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే పంపిణీ...
మార్చి 11, 2021
అమరావతి.... వచ్చే విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభ రోజున వివిధ ప్రాథమిక, మాధ్యమిక , ఉన్నత పాఠశాల
విద్యార్థులకు ఉపయోగ పడే కిట్స్‌తో పాటు ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిక్షనరీని అందించనున్నారు.
2. అందుకోసం రూ 736 కోట్ల మేర నిధులను వెచ్చిస్తున్నారు. ఒక్కో కిట్‌లో మూడు జతల దుస్తులు., బెల్ట్, స్కూలు బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల షూస్, రెండు జతల సాక్స్, బెల్టు, బ్యాగుంటాయి.
3. ఈ పర్యాయం ఉన్నత పాఠశాల చదువులు చదివే విద్యార్థులకు ఒక డిక్షనరీని కూడా అందించనున్నారు. కిట్స్ వస్తువులను కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, తగిన కాంట్రాక్టు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
4. కిట్స్‌ను ప్రభుత్వ, ఎంపీపీ, మునిసిపల్, రెసిడెన్షియల్, సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల, ఎయిడెడ్, మోడల్ పాఠశాలల, కేజీవీవీ, రిజిస్టర్డు మదరసాస్ విద్యార్థులందరికీ పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
5. ఈ .జగనన్న విద్య ఆ కానుక పథకం కింద వీటి పంపిణీకి కిట్స్ వస్తువులను సేకరించాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.
No Comment to " జగనన్న విద్యా కానుక ఒకటో తరగతి నుంచి టెన్త్ విద్యార్థులకు కిట్స్ 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభ రోజునే పంపిణీ... "