Freezing of DA to the State Government Employees and Government pensioners/family pensioners at current rates till July 2021
Freezing of Dearness Allowance to the State Government Employees and Government pensioners/family pensioners at current rates till July 2021 - Orders - Issued.
మూడు డీఏల వివరణ
════ ❈ ════
★ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మూడు డీఏలు కోత పెడుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.
★ కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ బాటలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
★ ఈమేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.
★ 2020 జనవరి, జులై ఒకటో తేదీల నుంచి ఇవ్వాల్సిన రెండు డీఏలతోపాటు 2021 జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన మరో డీఏ కూడా ఇవ్వబోమన్నారు.
★ తిరిగి 2021 జులై నుంచి కొత్త డీఏలు ఇస్తామన్నారు. ప్రస్తుతం నిలిపేసిన మూడు డీఏలను అప్పుడే పునరుద్ధరిస్తామన్నారు.
అయితే వీటి బకాయిలను ఇవ్వలేమన్నారు.
★ అదే సమయంలో 2021 జులై 1నాటి కరవు పరిస్థితులకు అనుగుణంగా అప్పటి నుంచి ఎంత కరవు భత్యం వర్తిస్తుందో ఆ మేరకే కొత్త డీఏల అమలు ఉంటుందని స్పష్టంచేశారు.
★ ఉద్యోగులకు 2018 జులై 1 నుంచి 3.144% మేర ఇటీవల మంజూరు చేసిన డీఏ యథాతథంగా అమలు కానుంది.
No Comment to " Freezing of DA to the State Government Employees and Government pensioners/family pensioners at current rates till July 2021 "