బదిలీలు ఉపాధ్యాయులందరికి ముఖ్య విషయాలు
బదిలీలు ఉపాధ్యాయులందరికి ముఖ్య విషయాలు
★ అందరు ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులందరికి తెలియజేయవలసిన ముఖ్య విషయాలు...
★ 1. బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16.11.2020. ఈ తేది తరువాత గడువు పొడిగించబడదు.
★ 2. 18.11.2012 కి ముందు జాయిన్ అయిన ఉపాధ్యాయులు మరియు 18.11.2015 కి ముందు జాయిన్ అయిన ప్రధానోపాధ్యాయులు అనగా 8/5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నవారు మరియు రేషనలైజేషన్లో పోస్టు బదిలీ చేయబడిన ఉపాధ్యాయులందరు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవలెను.
★ అలా చేసుకోని పక్షంలో, కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత.. చివరలో మిగిలిన ఖాళీలలో ఎక్కడపడితే అక్కడ వేస్తారు. వారు ఆప్షన్ కోరుకునే అవకాశాన్ని కోల్పోతారు.
★ 3. స్పోజ్ కేటగిరీ లో దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ఆప్షన్స్ ను ఇచ్చుకొనేటప్పుడు.. వారి స్పోజ్ కి అతి దగ్గర ఖాళీలను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చుకోవాలి. ఎక్కువ HRA ఉన్న ఖాళీలను ప్రాధాన్యతగా ఇచ్చి అతిదగ్గరగా ఉండే ఖాళీలను తరువాత ప్రాధాన్యత క్రమంలో ఇవ్వరాదు.
★ 4. అందరి దరఖాస్తులను,నిబంధనల మేరకు క్షుణ్నంగా పరిశీలించాలి.
★ ప్రతి DDO బదిలీలకు సంబంధించిన G.O లు,ఎప్పటికప్పుడు వచ్చే వివరణల ప్రతులు ప్రింట్ తీసి పెట్టుకోవాలి.వాటిని అవగాహన చేసుకోవాలి
★ 5. ప్రిఫరెన్సియల్ కేటగిరీ లో ,..వైద్య కారణాలతో దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు కాంపిటెంట్ అథారిటీ/ మెడికల్ బోర్డ్ నుంచి గత 6 నెలలలో తెచ్చుకున్న సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి.
★ 6. ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లలో ఎదో ఒకదాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరీక్షించాలి.
7. 8/5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పటి బదిలీల్లో మళ్ళీ
ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లలో ఎదో ఒకదాన్ని ఏ ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయని/HM ఉపయోగించరాదు.
★ 8. 8/5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పుడు రేషనలైజేషన్ లో పోస్ట్ షిఫ్ట్ అయ్యుంటే ఆ ఉపాధ్యాయుడు మళ్ళీ ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్కే టగిరీ లో ఎదో ఒక దాన్ని ఉపయోగించుకోవచ్చు.
★ 9. స్కూల్ కేటగిరి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తప్పుడు కేటగిరీ లో ఉన్న అప్లికేషన్ని పరిశీలించకుండా అలాగే సబ్మిట్ చెస్తే దానికి పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాడు మరియు మండల విద్యాశాఖాధికారి వహిస్తారు.
★ 10. Reapportionment exercise లో షిఫ్ట్ అయిన పోస్టులను ఖచ్చితంగా Reapportion వేకెన్సీ గా చూపించాలి. లేదంటే ఆ పోస్ట్ ఆ పాఠశాలకు రాదు. ఈ విషయాన్ని HM / MEO అతి జాగ్రత్తగా పరిశీలించుకొని నిర్ధారించుకోవాలి.
★ 11. ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా దానికి ఆ HM/ MEO దే భాద్యత. మరియు ఆ ఉపాధ్యాయుడి పైన చర్య తీసుకొనబడును.
★ 12. స్కౌట్, NCC, PH,.. మరియు అన్ని సర్టిఫికెట్స్ ని అతి జాగ్రత్తగా పరిశీలించి సర్టిఫై చేయవలెను.
★ చివరగా తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు మరియు రేషనలైజేషన్ లో పోస్ట్ షిఫ్ట్ అయిన ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత HM మరియు MEO లదే.
ADD MY NUMBER IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES
MY NUMBER 8985727170
No Comment to " బదిలీలు ఉపాధ్యాయులందరికి ముఖ్య విషయాలు "