News Ticker

Menu

ఆం.ప్ర ఉపాధ్యాయుల బదిలీలు - మార్గదర్శకాలు

 ఆం.ప్ర ఉపాధ్యాయుల బదిలీలు - మార్గదర్శకాలు


 ✍️బదిలీ కొరకు దరఖాస్తును https://cse.ap.gov.in వెబ్ సైట్ నందు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి . ఆన్ లైన్ లో దరఖాస్తును ఒక్కసారి మాత్రమే సమర్పించాలి.రెండ వసారి దరఖాస్తు చేయుటకు అనుమతి లేదు.

✍️ఆన్ లైన్ లో Options ఇవ్వాలి.వీటి ఆధారంగానే వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుంది.

✍️ ప్రభుత్వ జిల్లా ప్రజాపరి షత్ / మండల ప్రజాపరిషత్ పాఠశాలల్లో పనిచేయు Gr - II H.M / ఉపాధ్యాయులు బదిలీ కాబడతారు.

✍️తప్పనిసరిగా బదిలీ కాబడే వారు :

1.ప్రస్తుతము తాను పనిచేస్తు న్న పాఠశాలలో 18-11-2012 కంటే ముందు చేరిన టీచర్లు .

2.ప్రస్తుతము తాను పనిచేస్తు న్న పాఠశాలలో 18-11-2015 కంటే ముందు చేరిన Gr - II H.Ms.( 01-10-2020 నుండి 2 సంవత్సరాలు లోపు పదవీ విరమణ చేయు Gr - II H.MS / టీచర్లకు తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు కలదు).

✍️బదిలీ దరఖాస్తుకు కనీస అర్హత :

ప్రస్తుతము తాను పనిచేస్తున్న పాఠశాలలో ది.01-10-2020 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసి ఉండాలి .

✍️రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉపాధ్యాయులను గుర్తించు విధానము :

1.ఒక పాఠశాలలో మిగులు ఉపాధ్యాయుని పోస్టు ఉంటే , ఆ పాఠశాలలో 18-11-2012 కంటే ముందు చేరిన టీచర్ ఉంటే ఆ టీచర్ మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తించ బడతాడు.

2.  8 సం.లు long standing టీచర్ లేకుంటే , ఆ పాఠశాలలో సర్వీసులో జూనియర్ టీచర్ మిగులు ఉపాధ్యాయుడిగా
గుర్తించబడతాడు . ఒకవేళ సీనియర్ టీచర్ willing ఇస్తే ఆ సీనియర్ టీచర్ నే మిగులు ఉపాధ్యాయుడిగా గుర్తిస్తారు .

✍️Visually Challenged టీచర్లకు 8 సం.లు సర్వీసు పూర్తి అయినప్పటికి బదిలీ నుండి మినహాయింపు కలదు. వారంతట వారే బదిలీ కావాల నుకుంటే దరఖాస్తు చేసుకొన వచ్చు.

✍️ప్రస్తుతము తాను పనిచేస్తు న్న యజమాన్యం లోనే బదిలీ లు జరుగుతాయి.ఒక వేళ టీచర్ / Gr - I / H.M తన parent management లోకి బదిలీ కావాలని కోరుకుంటే , ఆ parent management లోని ఖాళీలను మాత్రమే opt చేసుకోవాలి.అటువంటి సందర్భాలలో parent management లోనే వారి సీనియారిటీ పరిగణించబ డుతుంది.

✍️Entitlement Points - Common Points.

1.ప్రస్తుత పాఠశాలలో సర్వీసు 01-10-2020 నాటికి  పాయిం ట్లు.

1.కేటగిరి - IV ఏరియా పాఠశా ల కు జిల్లా స్థాయి కమిటీ గడ చిన సంవత్సరాలలో ప్రకటించి న వాటి ఆధారంగా సం.నికి 5 పాయింట్లు.

2.కేటగిరి ౹౹౹ ఏరియా పాఠశా లకు ( 12 % HRA ) - సం.నికి 3 పాయింట్లు

3.కేటగిరి ౹౹ ఏరియా పాఠశా లకు ( 14.5 % HRA ) - సం. నికి 2 పాయింట్లు.

4.కేటగిరి-౹ ఏరియా పాఠశాలకు ( 20 % HRA ) - సం.నికి 1 పాయింట్ (Maximum - 40 పాయింట్లు)

✍️జిల్లా స్థాయి కమిటీ కేటగిరి - IV ఏరియా habitations ను తాజాగా గుర్తించినవి భవిష్యత్ బదిలీలకు పరిగణిస్తారు.తుది నిర్ణయం జిల్లా స్థాయి కమిటీదే.

✍️Entitlement Points - Service Points.

1).01-10-2020 నాటికి గల మొత్తం సర్వీసుకి - ప్రతి పూర్తి సంవత్సరానికి - 0.5 పాయిం ట్లు చొప్పున గారిష్టము గా 15 పాయింట్లు Total Entitlement Points ( Common Points + Service Points ) 55

✍️Special Points ( Extra Points ).

1).అవివాహిత ఉపాధ్యాయి నీ / ప్రధానోపాధ్యాయినీ - 5 పాయింట్లు.

2).టీచర్ యొక్క స్పౌజ్ రాష్ట్ర ప్రభుత్వ / కేంద్ర ప్రభుత్వ లేక ప్రభుత్వరంగ లేక స్థానిక సంస్థ లలో లేక ఆం.ప్ర రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో,ఎయిడెడ్ విద్యాసంస్థలలోఆం.ప్ర మోడల్ పాఠశాలలో ఇదే జిల్లాలో గానీ లేక ప్రక్క జిల్లాలో గాని జోనల్ పోస్టు ఐతే ఈ జోను లోనే పని చేస్తున్న యెడల - 5 పాయింట్లు

✍️గమనిక : 1 ) టీచర్ opt చేసుకొనే place స్పౌజ్ కి దగ్గ రగా ఉండాలి.

2).స్పౌజ్ పాయింట్ల లబ్ది 5/8 సం.లలో ఒకసారి one of the spouse వినియోగించు కొన వలెను.

3).స్పౌజ్ ఇద్దరూ తప్పనిసరి బదిలీ / రేషనలైజేషన్ లో మిగులు ఉపాధ్యాయు లుగా గుర్తించబడితే మొదట స్పెల్ కౌన్సెలింగ్ లోనే స్పౌజ్ జిల్లా లోని ఏదేని place opt చేసుకొనవచ్చు.

✍️1)దృష్టి లోపము / అంగ వైక ల్యము / వినికిడి లోపము 40 % - 55 % ఉన్న టీచర్లకు -5 పాయింట్లు.

✍️2).దృష్టి లోపము / అంగవై కల్యము / వినికిడి లోపము 56 % - 69 % ఉన్న టీచర్లకు - 10 పాయింట్లు.

✍️3).గుర్తింపు పొందిన ఉపా ధ్యాయ సంఘాల రాష్ట్ర / జిల్లా స్థాయి అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి 5 పాయింట్లు Total Special Points 25

 ✍️Rationalization Points :

1).రేషనలైజేషన్ లో మిగులు టీచర్ / Gr - II H.M కి అదనంగా - 5 పాయింట్ లు

2).తాను పనిచేస్తున్న పాఠశాల లో 18-11-2012 కంటే ముం దు 8 విద్యా సంవత్సరాలు చేరిన టీచర్లు లేక 18-11- 2015 కంటే ముందు ( 5 విద్యా సంవత్సరాలు ) చేరిన Gr - II H.Ms రేషనలైజేషన్ లో మిగులు టీచర్ / Gr - II H.M గా గుర్తించి నప్పటికి రేషనలైజేషన్ పాయింట్లు వర్తించవు.

3).సమానమైన పాయింట్లు వచ్చిన సందర్భంలో :

✍️కేడర్ లో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి

✍️పుట్టిన తేదీకి ప్రాధాన్యతను ఇవ్వాలి .

✍️మహిళలు

Preferential Categories : Entitlement points తో సంబంధం లేకుండా ఈ క్రింది కేటగిరిలను సీనియారిటీ జాబి తాలో ముందు ఉంచాలి.

✍️దృష్టి లోపము / అంగవైక ల్యము / వినికిడి లోపము 70 % కన్నా తక్కువ కాని PHC లు

✍️విధవలు / చట్ట బద్దంగా విడిపోయిన మహిళ.

✍️క్రింది జబ్బులతో బాధపడే టీచర్లు:-
1).cancer
2).Open Heart Surgery / 3).Correction of ASD ( Atrial Septal Defect ) 4).Organ Transplantation 5).Neuro Surgery
6). Bone TB v ) 7).Transplantation / Diayalasis.
8).Spinal Surgery.
9).దరఖాస్తుదారుని మీద ఆధా రపడి , మానసిక వికలాంగులై చికిత్స పొందుచున్న వారి తల్లి , తండ్రి , పిల్లలు , దరఖాస్తుదారుని స్పౌజ్ .
10).పుట్టుకతో గుండెలో రంధ్రాలు ఉండి కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో వైద్య చికిత్స లభ్యమయ్యే పిల్లలు గల దరఖాస్తుదారు . 11).దరఖాస్తుదారుని మీద ఆధారపడి Juvenile Diabetes , Thalassemia , Hemophilia Muscular Dystrophy తో బాధపడుచున్న పిల్లలు. 12).Service  person in Army / Navy / Airforce / BSF / CRPF / CISF

✍️గమనిక :

దరఖాస్తుదారుడు 14 వ పాయింట్ నందలి(d ), ( e ),( f ) health grounds క్రింద క్లెయిమ్ చేసినట్లైతే , హాస్పిటల్ నుండి latest reports Joint Collector ( Development ) variki సమర్పించవలెను .

✍️గమనిక :

Preferential Category 5/8 సం.లలో ఒకసారి మాత్రమే వినియోగించు కొనవలెను .

✍️గమనిక :

Preferential category 5/8 సం.లలో ఒకసారి మాత్రమే వినియోగించు కొనవలెను .

✍️గమనిక :

Preferential Category వినియోగించుకొనే PHC లు SR లో నమోదు ఉంటే దాలు . తాజాగా certificate అవసరం లేదు.

✍️Counseling కొరకు చూపు ఖాళీలు:-

a ) అన్ని క్లియర్ వేకెన్సీలు

b ) తప్పనిసరి బదిలీ ఖాళీలు

c ) Resultant Vacancies

d ) 1 సం.ము పైగా అధికారి కంగా / అనధికారికంగా సెలవులో ఉన్న ఖాళీలు

✍️Maternity leave , వైద్య కారణాలపై సెలవులో ఉన్న ఖాళీలను చూపరాదు.

✍️ఒక కేడర్ లో మంజూరైన పోస్టులకు పనిచేయుచున్న పోస్టులకు మధ్య వ్యత్యాసము ఎంత ఉంటుందో , అన్ని పోస్టు లు ప్రతి మండలంలో ఒకే నిష్పత్తిలో కేటగిరి 1,2,3, places  లో block చేయబ డతాయి .

ఉదాహరణకు :ఒక జిల్లాలో SGT sanctioned - 8000 , Working : 7500


 ఉంటే , వ్యత్యాసము - 500 block చేయబడతాయి .

ఈ 500 పోస్టులు 54 మండ లాలలో ఒక నిష్పత్తిలో కేటగిరి 1,2 ,3,places block చేయబడతాయి.

ధన్యవాదములతో


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆం.ప్ర ఉపాధ్యాయుల బదిలీలు - మార్గదర్శకాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM