పాఠశాలలు, కళాశాలలు నవంబర్ 2 నుండి ప్రారంభించబడుతున్నందున క్రింది తెల్పిన 10 ప్రామాణిక, ఆచరణాత్మక పద్దతులను ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో ఆచరించవలెనని ఆదేశాలు
పాఠశాలలు, కళాశాలలు నవంబర్ 2 నుండి ప్రారంభించబడుతున్నందున క్రింది తెల్పిన 10 ప్రామాణిక, ఆచరణాత్మక పద్దతులను (SOPs) ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో ఆచరించవలెనని ఆదేశాలు
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు - సంక్షిప్తంగా:
👉01/01/2020 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి.
అదే రోజు తల్లిదండ్రుల సమావేశం జరిపి పిల్లలను పాఠశాలలకు పంపుటకు సంసిద్దులను చేసి,వారి యొక్క అభిప్రాయాలను కూడా నమోదు చేయాలి
👉02/11/20న 9,10 తరగతులను ప్రారంభించాలి
👉23/11/20 నుండి 6-8 తరగతులను ప్రారంభించాలి
👉14/12/20 నుండి 1-5 తరగతులను ప్రారంభించాలి
👉సాధారణ తరగతి గదిలో 16 మంది విద్యార్థులను మాత్రమే కూర్చో బెట్టాలి
👉ఒక రోజు 9 వతరగతి, మరుసటి రోజు 10 వతరగతి అనగా రోజు మార్చి రోజు విద్యార్థులు తరగతి వారీగా హాజరు కావాలి.అయితే ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరు కావాలి
👉పాఠశాల ఉ.9 గం.ల నుండి మ1.45 గం.ల వరకు ఉంటుంది
9 am -9.15am- కోవిడ్ సూచనలు
9.15 నుండి తరగతులు ప్రారంభమవుతాయి
ప్రతి 45ని పీరియడ్ తరువాత 5నిllనీటికోసం,10నిll యోగా, సాధారణ నడక ప్రాణాయామం లాంటివి చేయాలి
👉 మధ్యాహ్నం 1గం.ల తరువాత చివరి 45ని విద్యార్థులకు భోజన సమయం
👉విధ్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మాస్క్ ధరించాలి,చేతులు శుభ్రం చేసుకోవాలి మరియు భౌతిక దూరం పాటించాలి
👉1.45 తరువాత విద్యార్థులు ఇంటికి వెళ్ళి పోతారు
👉2 pm -4.15 pm పాఠశాలకు రాని విద్యార్థులకు అన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులు భోదన చేయాలి.
👉ఎస్.సి ఆర్.టి.ఇ వారి ప్రణాళిక ప్రకారం నవంబరు 2 నుండి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు జరుగును.మొత్తం 180రోజులు పనిదినాలు వస్తాయి.
👉 పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ కోసం అభ్యాస, దీక్షా యాప్ల ద్వారా తెలుసుకోగలరు.దూరదర్శన్, మరియు వాట్సాప్,యూట్యూబ్ ద్వారా విషయ సంగ్రహణ చేయువిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.
No Comment to " పాఠశాలలు, కళాశాలలు నవంబర్ 2 నుండి ప్రారంభించబడుతున్నందున క్రింది తెల్పిన 10 ప్రామాణిక, ఆచరణాత్మక పద్దతులను ప్రతి పాఠశాలలో మరియు కళాశాలలో ఆచరించవలెనని ఆదేశాలు "