News Ticker

Menu

న‌వోద‌య విద్యాల‌య స‌మితి (ఎన్‌వీఎస్‌) లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 454 మంది ఉపాధ్యాయుల భ‌ర్తీ

454 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల 

న‌వోద‌య విద్యాల‌య స‌మితి (ఎన్‌వీఎస్‌) లో  కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 454 మంది ఉపాధ్యాయుల భ‌ర్తీకి న‌వోద‌య విద్యాల‌య స‌మితి నోటిఫికేష‌న్ జారీ చేసింది.అర్హత కల అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తుల‌ను ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానించింది. గోవా, గుజ‌రాత్‌, మ‌హారాష్ర్ట‌, డామ‌న్‌ డ‌య్యు, దాద్రా న‌గ‌ర్ హ‌వేలీలో ఖాళీలను అనుస‌రించి కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఎన్‌వీఎస్ తెలిపింది.

💨  మొత్తం 454 ఖాళీల్లో 73 ఫ్యాకల్టీ కమ్సి స్టమ్అ డ్మినిస్ట్రేటర్ పోస్టులు కాగా 98 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), 283 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులున్నాయి.

💨 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్  పోస్టుల‌కు నెల‌వారీ జీతం సాధార‌ణ స్టేష‌న్ అయితే రూ. 27,500గా అదే హార్డ్ స్టేష‌న్‌(కుచ్‌, డాంగ్స్‌, ర‌త్న‌గిరి)లోనైతే నెల‌కు రూ. 32,500గా ఉంది.  

💨 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల‌కు నెల‌వారీ జీతం సాధార‌ణ స్టేష‌న్‌లోనైతే రూ. 26,250గా అదే హార్డ్ స్టేష‌న్‌(కుచ్‌, డాంగ్స్‌, ర‌త్న‌గిరి)లోనైతే నెల‌కు రూ.31,250గా ఉంది. 

💨  అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలి. ద‌ర‌ఖాస్తుల‌ను conpune20@gmail.com కు పంపించాలి.

ఉపాధ్యాయ ఉద్యోగాలు

మొత్తం పోస్టులు- 454

💨 1. PGT  -  98 

 Hindi            -16 

English          -06

Mathematics- 10

Biology         -17 

Chemistry     -14

Physics          -14

Economics    -03 

Geography   - 06 

History         -10

PGT-I.T.      - 02


💨 2. TGT - 283 


Hindi            -48

English         -31

Mathematics-48

Science        -28
 
So.St.           -32

Marathi        -08
 
Gujarati        -13

Art                -17

Music           -13
 
PET(Male)   -20
 
PET(Female)-13

Librarian       -12


💨 3. ఫ్యాకల్టీ కమ్-సిస్టమ్అ డ్మినిస్ట్రేటర్ పోస్టులు - 73

ఎంపిక విధానం : రాత పరీక్ష లేదు,ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 3

దరఖాస్తుల‌కు చివరితేదీ: సెప్టెంబర్ 11

ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబర్‌ 15 నుంచి 17 వరకు ఉంటాయి.

వెబ్‌సైట్ ‌: https://navodaya.gov.in/

దరఖాస్తు ఎలా చేయాలి:


అర్హతగల ఆసక్తి గల అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.

పూర్తీ చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను 11/09/2020 న 5:00 PM conpune20@gmail.com కు పంపించాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఉపాధ్యాయుల‌కు బోర్డింగ్‌, లాడ్జింగ్ క్యాంప‌స్ ఆవ‌ర‌ణ‌లోనే క‌ల్పించ‌నున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు.

గూగుల్‌ ఫామ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే Fill Online Form to Apply for NVS PGT/TGT/FCSA Recruitment 2020 పై క్లిక్‌ చేయండి.
 
 

 

 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " న‌వోద‌య విద్యాల‌య స‌మితి (ఎన్‌వీఎస్‌) లో కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న 454 మంది ఉపాధ్యాయుల భ‌ర్తీ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM