News Ticker

Menu

దేశవ్యాప్తంగా స్కూళ్లు, విద్యాసంస్థలు తెరిచే తేదీలు ఖరారు..

 దేశవ్యాప్తంగా స్కూళ్లు, విద్యాసంస్థలు తెరిచే తేదీలు ఖరారు..

దేశవ్యాప్తంగా స్కూళ్లు, విద్యాసంస్థలు తెరిచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు కూడా సిద్దం చేసినట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. దేశంలో దశలవారీగా స్కూళ్లు, విద్యాసంస్థల తెరుచుకోనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశలవారీగ స్కూళ్లు, విద్యాసంస్థలు రీ ఓపెన్ అవుతాయి. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నిబంధనలు అమలు చేయాలనే అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఈనెల 31న స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆ మార్గదర్శకాల ప్రకారం మొదటి 15 రోజులు 10 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు మాత్రమే హాజరవుతారు. ఒకవేళ ఆ క్లాసుల్లో A, B, C, D అని నాలుగు సెక్షన్లు ఉంటే ఒక రోజు A, C సెక్షన్ల విద్యార్థులు హాజరవుతారు. మరో రోజు B, D సెక్షన్ల విద్యార్థులు హాజరవుతారు.

స్కూళ్లు, విద్యాసంస్థలు కేవలం 5 నుంచి 6 గంటల పాటు మాత్రమే పనిచేస్తాయి. రెండు షిఫ్టుల్లో పనిచేయనున్నాయి. ఉదయం 8 - 11 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు మరో షిఫ్ట్‌లో స్కూళ్లు, విద్యాసంస్థలు పనిచేస్తాయి. ఆ మధ్యలో ఉండే గంట సమయంలో విద్యార్థులు కూర్చునే ప్రదేశం, ఆ ప్రాంతం మొత్తం శానిటైజ్ చేయాలి. స్కూళ్లు, విద్యాసంస్థలు 33 శాతం స్టాఫ్‌తో నడిపించేందుకు మాత్రమే అనుమతించనున్నట్టు తెలిసింది.స్కూళ్లు, విద్యాసంస్థల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఈ విధానం మీద కేంద్ర కార్యదర్శులు సమగ్రంగా చర్చించి ఓ అంతిమ నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఆగస్ట్ 31 నాటికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే, స్కూళ్లు, విద్యాసంస్థలు తెరవాలా? వద్దా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేయనుంది కేంద్రం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్రాలు నిర్వహించిన సర్వేలో చాలా మంది తల్లిదండ్రులు ఈ ఏడాది స్కూళ్లు, విద్యాసంస్థలు తెరవొద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు క్లాసులు నిర్వహించడానికి కేంద్రం సంసిద్ధంగా లేదని తెలుస్తోంది. మొదట 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభిస్తారు. అనంతరం 6 నుంచి 9 తరగతులు ప్రారంభించనున్నారు. పరిస్థితిని బట్టి చిన్న తరగతులపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో అమల్లో ఉన్న ఈ విధానం భారత్‌కు సరిపోతుందని కేంద్ర అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " దేశవ్యాప్తంగా స్కూళ్లు, విద్యాసంస్థలు తెరిచే తేదీలు ఖరారు.. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM