News Ticker

Menu

టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు

 టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు


➪ సీఎం ఆమోదానికి ఫైల్

➪ ఖాళీల ప్రకారం బదిలీలు

𒊹︎︎︎ సాక్షి, అమరావతి:

✰ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం (ఫైలు)ను పంపింది.

✰ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బది లీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు.

✰  వెబ్ కౌన్సెలింగ్  ద్వారా ఈ బదిలీలు చేపట్టనున్నారు.

✰ టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్లైన్లోనే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.

✰  ఇక బదిలీలకుసంబంధించిక్షేత్రస్థాయిలో అనేక అంశాలపై నిర్ణయాలు చేపట్టాల్సి ఉన్నందున ముందుగా అందుకు సంబం ధించిన కసరత్తును అధికారులు చేపట్టారు.

✰  ఖాళీల వివరాలతో పాటు ఇతర అంశాలను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.

✰ ఇప్పటికే ఇందుకు సంబంధించి మండల స్థాయి నుంచి వివరాల సేకరణ ప్రక్రియను చేపట్టారు.

✰ హేతుబద్దీకరణ, తప్పనిసరి బదిలీ, పదోన్నతి రాజీనామా, పదవీ విరమణతో అయ్యే ఖాళీల జాబితాలను పంపించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు .

✰ అనధికారిక సెలవు, గైర్హాజరులో ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భాళీలుగా చూపించాలని పేర్కొంది.

✰ సస్పెన్షన్లో ఉన్న వారి ఖాళీలను పరిగణనలోకి తీసుకోరాదని వివరించిందిమరోవైపు ఆయా జిల్లాల విద్యాధికారులు ఇందుకు అనుగుణంగా వివరాలు సేకరణ చేపట్టారు.

✰ యుడైస్  కోడ్ ప్రామాణికంగా పాటశాలల్లోని ఖాళీలల వివరాలను పరిగణనలోకితీసుకోవాలి.

✰ ఆయా ఖాళీల సమాచారానికి కోడ్ జాగ్రత్తగా నమోదు చేయాలి.

✰ హెచ్ ఆర్యే అనుసరించి నాలుగు కేటగిరీలుగా స్కూళ్లను చూపించాలి.

✰ ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీ స్కూల్ వివరాలు మాత్రమే నమోదు చేయాలి.

✰ సెప్టెంబర్ 1 నాటికి ఉండే ఖాళీల సంఖ్యను పరి గణనలోకి తీసుకోవాలి భాషా పండితుల (లాంగ్వేజ్ పండిట్) పోస్టులుస్కూల్ అసిస్టెంటు (లాంగ్వేజ్)గా అప్ గ్రేడ్ అయినందున వాటిని ఎస్పీగా పేర్కొనకూడదు.

✰ 2015 నవంబర్ 18వ తేదీ కన్నాముందు తేదీల నుంచి ప్రస్తుత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధా ఉపాధ్యాయులు, టీచర్ వివరాలు సమర్పించాలి

✰ 1970 సెప్టెంబర్ 1 తరువాత పుట్టిన పురుష ఉపాధ్యాయులు బాలికల హైస్కూళ్లలో పనిచే స్తుంటే వారి వివరాలు ఇవ్వాలి

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " టీచర్ల బదిలీలపై విద్యాశాఖ కసరత్తు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM