News Ticker

Menu

ఏపీలో విద్యార్థులకు... 1 నుంచి 8 క్లాసుల వారికి వచ్చే ఏడాదీ పరీక్షల్లేవ్..9,10 కి మాత్రమే పరీక్షలు... మంత్రి సురేష్..

 ఏపీలో విద్యార్థులకు... 1 నుంచి 8 క్లాసుల వారికి వచ్చే ఏడాదీ పరీక్షల్లేవ్..9,10 కి మాత్రమే పరీక్షలు... మంత్రి సురేష్..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అంటే, వాస్తవ షెడ్యూల్ కంటే మూడు నెలలు ఆలస్యంగా క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 30 శాతం నుంచి 40 శాతం మేర సిలబస్ తగ్గించే అవకాశం ఉంది. విద్యా సంవత్సరం ఎంత మిగిలి ఉంది?, ఎన్ని రోజులు స్కూళ్లు జరుగుతాయి?, ఏ విధంగా విద్యా విధానం ఉంటుందనే అంశాన్ని బట్టి ఎంతమేర సిలబస్ తగ్గించాలనేది నిర్ణయిస్తారు. 'మనకు ఒక విద్యాసంవత్సరంలో 222 రోజులుంటే, అందులో 90 రోజులు ఇప్పటికే నష్టపోయాం.' అని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
అయితే, పరీక్షల విధానంలో కానీ, ప్రశ్నా పత్రం విధానంలో కానీ మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.

'సిలబస్‌కు సంబంధించిన వర్క్ బుక్స్‌ను ప్రభుత్వ పాఠశాలలకు అందించాం. విద్యార్థుల కోసం విద్యావారధి వాహనాలు కూడా ఏర్పాటు చేశాం. అయితే, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆన్ లైన్ క్లాసులు జరగడం లేదు. దీన్ని బట్టి ఒక ఏడాది సిలబస్ ఆరు నెలల్లో పూర్తి చేయడం అంటే అటు విద్యార్థులకు, ఇటు టీచర్లకు కూడా కష్టమే. కాబట్టి సిలబస్ తగ్గించాలని నిర్ణయించాం.' అని ఆదిమూలపు సురేష్ అన్నారు. అయితే, సిలబస్‌లో దేన్ని దేన్ని తీసేస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. SCERT అధికారులు దీనిపై సమగ్రంగా చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. స్కూళ్లు రీ ఓపెన్ అయిన తర్వాత దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.ఒకటి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు ఉండవని, ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా వారిని ప్రమోట్ చేస్తామని చెప్పారు. అయితే, 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం పరీక్షలు ఉంటాయి. స్కూళ్లలో ఎలాంటి విధానాలు పాటించాలనే దానిపై ప్రభుత్వం ఒక పద్ధతి సూచిస్తుంది. ప్రతి 15 రోజులకు ఓ సారి స్కూళ్లు తమ విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించి, వారి హెల్గ్ రికార్డులు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. అలాగే, ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాల్సి ఉంటుంది. ఆ రోజు క్రీడా, వినోద, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి బదులు బియ్యం ఇస్తారు. స్కూళ్లలో ఉదయం పూట నిర్వహించే 'అసెంబ్లీ'ని ఇకపై విద్యార్థులు తమ తమ క్లాసుల్లోనే నిర్వహిస్తారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఏపీలో విద్యార్థులకు... 1 నుంచి 8 క్లాసుల వారికి వచ్చే ఏడాదీ పరీక్షల్లేవ్..9,10 కి మాత్రమే పరీక్షలు... మంత్రి సురేష్.. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM