మన హైదరాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్...ఇలా రెడీ అవుతోంది
మన హైదరాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్...ఇలా రెడీ అవుతోంది

ఇప్పుడు అందరి చూపు కరోనా వ్యాక్సిన్ పైనే. దేశవ్యాప్తంగా ఈ
మహమ్మారి ఉధృతి పెరిగిపోతున్న నేపథ్యంలో అంతా వ్యాక్సిన్ కోసం
నిరీక్షిస్తున్నారు. ఇలాంటి తరుణంలో, దేశంలో ఇప్పటివరకు ఏడు సంస్థలు
తయారుచేసిన వ్యాక్సిన్లు హ్యూమన్ ట్రయల్స్ కోసం ఐసీఎమ్మార్ నుంచి అనుమతి
పొందాయి. అందులో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ
తయారుచేసిన కొవాగ్జిన్ మొదటిది. కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని
ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్
తయారుచేసిన కొవాగ్జిన్‌పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.
రెండు
తెలుగు రాష్ట్రాల్లోనూ ర్యాండమైజ్డ్ , డబుల్ బ్లైండ్ విధానంలో ప్లాసిబో
కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్ ఈ నెల 15నుంచి ప్రారంభమైనట్టు భారత్
బయోటెక్ సంస్థ తెలిపింది.
తెలంగాణలో నిమ్స్‌లో ఇప్పటి వరకు ఇద్దరు క్లినికల్
ట్రయల్స్‌కు అర్హులని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కింగ్‌జార్జ్
దవాఖానలో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈనెల 7 నాటికే క్లినికల్ ట్రయల్స్
ప్రారంభించాలని ఐసీఎమ్మార్ ఆదేశించినా వలంటీర్స్ ఎంపిక, ఆరోగ్య
పరీక్షల్లో ఆలస్యంతో జాప్యం జరిగింది. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారిపై
మాత్రమే క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. దాంతో ట్రయల్స్ కోసం
నమోదు చేసుకున్నవారి పూర్తి ఆరోగ్య పరీక్షల సమాచారాన్ని ఐసీఎమ్మార్‌కు
పంపించిన తర్వాతే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.
ఐసీఎమ్మార్,
పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ ఈ
వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అనంతరం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.
మొదటి దశ వ్యాక్సిన్ తీసుకున్నవారిని 28 రోజుల పాటు పరీక్షించాల్సి
ఉంటుంది. వీరి శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేసి వివరాలను
ఐసీఎమ్మార్‌కు పంపాలి. వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్స్ ఆరోగ్య
సమాచారాన్ని విశ్లేషించి రెండో దశలో ఎంతమందిపై ఎక్కడెక్కడ క్లినికల్
ట్రయల్స్ చేయాలో నిర్ణయిస్తారు. రెండు దశల్లో హ్యూమన్ క్లినికల్
ట్రయల్స్‌కు ఐసీఎమ్మార్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
No Comment to " మన హైదరాబాద్ నుంచే కరోనా వ్యాక్సిన్...ఇలా రెడీ అవుతోంది "