News Ticker

Menu

2020-21 విద్యా సంవత్సరం - కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు

♦పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ - 2020-21 విద్యా సంవత్సరం - కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు


🍁విద్యార్థి వారీ ప్రణాళిక

❇️మొదటగా ప్రతి ఉపాధ్యాయుడూ తన తరగతిలోని విద్యార్థులకు విద్యార్థివారీ ప్రణాళికను రూపొందించుకోవాలి.

❇️విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి.

అ) ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (హై టెక్)

ఆ) రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు (లో టెక్)

ఇ) కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు (నో టెక్).


❇️గ్రామస్థాయిలోనూ, పట్టణాల్లో వెనకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులు ఎక్కువమందికి ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేనందువల్ల ముఖ్యంగా వారి పైన దృష్టి పెట్టే విధంగా ఉపాధ్యాయుడు తన ప్రణాళిక తయారు చేసుకోవాలి.

*❇️ఆ ప్రణాళికలో ఆయా తరగతుల వారికి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు
సూచించిన విధంగా ఈ దిగువ పాఠ్యప్రణాళిక రూపొందించుకోవాలి.*

❇️అ) 1 నుండి 5 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 (నాలుగు వారాలు మొదటి భాగం, 8 వారాలు రెండో భాగం) వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో చూపిన కృత్యాలు చేయించడం. ఇందుకు గాను, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు కృత్యపత్రాలు తయారు చేసుకోవాలి.*

❇️వాటిని స్థానికంగా ముద్రించుకోవడం గాని లేదా ఫొటో కాపీ తీయించుకోవడం గాని లేదా కంప్యూటరు
ద్వారా ప్రింటు తీసుకోవడం గాని చేయాలి. ఆకృత్యపత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేసి వారి ద్వారా
విద్యార్థులు ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి. దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలు పర్యవేక్షణ,
ప్రత్యామ్నాయ కాలెండర్ పర్యవేక్షించాలి.

*❇️ఆ) 6 నుండి 8 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ
కాలెండరులో చూపిన ప్రాజెక్టు పనులు పిల్లలద్వారా చేయించాలి.*

*❇️పిల్లలు అటువంటి కృత్యాలు ఏ విధంగా చేపట్టాలో వారి తల్లిదండ్రులకు వివరించాలి. దూర దర్శన్ ద్వారా ప్రతి వారం ఒక పాఠం ద్వారా వివరించాలి.
దూరదర్శన్ సౌకర్యం ఉన్న విద్యార్థులను లేని విద్యార్థులతో ఇద్దరిద్దరు చొప్పున జతపరిచి సౌకర్యాలు ఉన్న విద్యార్థుల ద్వారా సౌకర్యాలు లేని విద్యార్థులకు సమాచారాన్ని చేరవేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వారు
ఆ విధంగా ప్రాజెక్టు పనులు చేస్తున్నారో లేదో తల్లిదండ్రుల ద్వారా పర్యవేక్షించుకోవాలి.*


❇️ఇ) 9, 10 తరగతులకు: వీరికి విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఇందుకుగాను, నాలుగు వారాల ప్రత్యామ్నాయ కాలెండరును ఉపయోగించుకోవాలి. వారికి ఆన్ లైన్, రేడియోల ద్వారా శిక్షణ చేపట్టవచ్చు.

❇️అంతేకాక స్థానికంగా అందుబాటులో ఉన్న విద్యావంతులైన యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లయితే వారి సేవలు కూడా వినియోగించుకోవచ్చు.

Share This:

teacherbook.in

No Comment to " 2020-21 విద్యా సంవత్సరం - కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM