News Ticker

Menu

School children competitions -స్కూల్​ పిల్లలకు లక్ష రూపాయల పోటీ

School children competitions -స్కూల్​ పిల్లలకు లక్ష రూపాయల పోటీ



హైదరాబాద్ : ప్రేవేటు, గవర్నమెంట్​ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్​ఐఆర్​(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది.

పన్నెండవ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు. పద్ధెనిమిదేళ్లలోపు వయస్సుండాలి. బహుమతుల వివరాలిలా ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్... రూ. లక్ష, సెకండ్ ప్రైజ్(ఇద్దరికి)... రూ. 50 వేలు, థర్డ్ ప్రైజ్(ముగ్గురికి)
రూ. 30 వేలు, ఫోర్త్ ప్రైజ్(నలుగురికి) రూ.20 వేలు, ఫిఫ్త్ ప్రైజ్(ఐదుగురికి) రూ. 10 వేలు.

ఇక పూర్తి వివరాలకు... [email protected] కు మెయిల్ చేయవచ్చు లేదా www.csir.res.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్ లేదా సొల్యూషన్... ఏదైనా ఇంగ్లిష్ లేదా హిందీలో 5,000 పదాలకు మించకుండా రాయాలి. మీ స్కూల్ ప్రిన్సిపల్ ధ్రువీకరణతో పంపించాలి.

దరఖాస్చితులకు వరి తేదీ; జూన్ 30 . ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పంపించవచ్చు. బెస్ట్ 15 ఎంట్రీలకు క్యాష్ ప్రైజ్‌తో పాటు సర్టిఫికెట్ అందించనున్నారు.
www.csir.res.in

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " School children competitions -స్కూల్​ పిల్లలకు లక్ష రూపాయల పోటీ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM