News Ticker

Menu

మన బడి నాడు నేడు : గమనించవలసిన కొన్ని ముఖ్యాంశాలు

మన బడి నాడు నేడు : గమనించవలసిన కొన్ని ముఖ్యాంశాలు



1. APMDC కి స్కూల్ నుండి అప్ లోడ్ చేసి ఇంతవరకు సరఫరా కాని ఇసుక ఇండెంట్లు రద్దు చేయబడతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గ స్థాయి ఇసుక డిపోల నుండి ఇసుకను అన్ లైన్ ఇండెంట్ ద్వారా హెడ్మాష్టర్ మరియు ఫీల్డ్ ఇంజనీర్ పేరేంట్స్ కమిటి బాధ్యులు ఇసుకను కొనుగోలు చేయాలి. ఇసుక రవాణా ఖర్చులు మరియు ఇసుక ఖరీదు చేసిన బిల్లులు అప్ లోడ్ చేయాలి.

2. DD (Mines& Geology) గారు వివిధ మండలాలు సమీపంలోని నియోజకవర్గం ఇసుక డిపోలను మ్యాపింగ్ చేయడం జరిగింది. ఆయా మండలాల వారు సంబంధిత ఇసుక డిపో నుండి ఇసుకను కొనుగోలు చేయాలి.

3. ఎలక్ట్రికల్ పరికరాలు వైర్లు/కేబుల్స్ స్విచ్ మరి ప్లగ్ లు చాలా చోట్ల డూప్లికేట్ లేదా సెకండ్స్ వి కొనుగోలు చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఫీల్డ్ ఇంజనీర్ మరియు హెడ్మాష్టర్ లు ఇంతకుముందు ఇచ్చిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే సూచించిన బ్రాండెడ్ ( లెగ్రాండ్/గోల్డ్ మెడల్/ GM ) వస్తువులు కొనవలెను.

4. రాతి కట్టడాలు గోడలు ఉన్న స్కూల్ లో కన్సీల్డ్ (Concealed) వైరింగ్ కోసం ఎక్కువ ఖర్చుతో గాడులు చేయవలసిన పని లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా వైరింగ్ ని కేసింగ్  క్యాప్ ( Casing Cap ) చేయించాలి.

5. స్కూల్ పనుల కోసం అవసరమైన అన్ని వస్తువులు ఒకేసారి కొని ఎక్స్పెండిచర్ బుకింగ్ చేయాలి.

6. ఏ స్కూల్ లో అయినా ఎవరైనా కాంట్రాక్టర్ ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే సంబంధిత అధికారి ఎంత సీనియర్ అయినప్పటికీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.

7. రిజెక్టెడ్ బిల్స్ ను  AE log in లో నుండి బిల్ల్ డౌన్ లోడ్ చేసి హెడ్మాష్టర్ తో సంతకం చేసి అప్ లోడ్ చేయవలెను.

8. ఏదైనా స్కూల్ ప్రాజెక్టు ఎస్టిమేషన్ అనుమతించిన పరిమితి కంటే ( Enrollment based Ceiling limit) తక్కువగా ఉంటే అనుమతించిన సీలింగ్ లిమిట్ వరకు  ఎస్టిమేట్స్ పెంచి రివైజ్ చేసుకోవచ్చు.

9. ఫర్నిచర్ ఇండెంట్ :
A) స్కూల్ లో ప్రస్తుతం ఉన్న ఉపయోగించదగిన ( Usable ) ఫర్నిచర్ మినహయించుకోని అవసరమైనంత వరకు మాత్రమే ఇండెంట్ పెట్టాలి. ఇది స్కూల్ లో వర్కింగ్ కండీషన్‌లో ఉన్న ఫ్యాన్ లను కూడా లెక్కించి వాటిని మినహాయించి తర్వాత అవసరమైన ఫ్యాన్‌లకు మాత్రమే ఇండెంట్ పెట్టాలి .

10. ఇటీవల 2 లేదా 3 సంవత్సరాల క్రిందట మాత్రమే పెయింటింగ్ చేయించిన స్కూల్ పెయింటింగ్ కోసం ఇండెంట్ పెట్టవలసిన అవసరం లేదు. దీని వలన పొదుపు అయ్యే డబ్బును స్కూల్ లో అవసరమైన ఇతర పనులు లేదా రిపేర్లకు ఉపయోగించవచ్చు.

11. అన్ని స్కూల్ హెడ్మాష్టర్ లు డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ ఎక్విప్మెంట్ కోసం ఒక లీటరు నీటిని సమీపంలోని  RWS Lab కి పంపించి టెస్టింగ్ చేపించాలి. Report తీసుకొని ఉండాలి.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " మన బడి నాడు నేడు : గమనించవలసిన కొన్ని ముఖ్యాంశాలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM