COVID19 - Apply Volunteer/Doctors/Specialist
COVID19 Apply Volunteer/Doctors/Specialist కోవిడ్ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం
కోవిడ్–19 వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వలంటీర్ల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం.గిరిజాశంకర్ ప్రకటన విడుదల
ప్రకటన లోని అంశాలు..
- 13 జిల్లాల్లోని 271 మెడికల్ కళాశాలలు/డెంటల్/యునాని/ఆయుర్వేద/నర్సింగ్ కళాశాలలు, ఇతర వైద్య అనుబంధ కోర్సులు చదివే విద్యార్థులు కోవిడ్ వలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు.
- ఆసక్తి ఉన్న వైద్యులు, ప్రత్యేక వైద్య నిపుణులు, నైపుణ్యం కల్గిన నర్సులు, పారా మెడికల్ సిబ్బంది తదితరులు కూడా కోవిడ్ వారియర్స్‌గా పని చేసేందుకు ముందుకు రావాలి. వీరి సేవలను ఆస్పత్రుల్లో, క్వారంటైన్ సెంటర్లలో వినియోగించుకుంటాం.
- వలంటీర్లుగా పనిచేసినవారికి భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే రిక్రూట్‌మెంట్‌లలో ప్రాధాన్యం ఇస్తాం.
- వలంటీర్ల సేవలను వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వినియోగించుకుంటాం. ఆసక్తి కల్గినవారు వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి.
No Comment to " COVID19 - Apply Volunteer/Doctors/Specialist "