March Month Salary @ 2 Installments
March Month Salary @ 2 Installments
మార్చినెల జీతాన్ని రెండు విడతల్లో ఇస్తాం...ప్రస్థుత పరిస్థితిరీత్యా దయచేసి ఉద్యోగులు సహకరించండి..
జీతంలో కోత ఉండదు....
ప్రజా ప్రతినిధుల వేతనాలు తగ్గింపు...
AP CM
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వెల్లడించారు. ఇవాళ సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఆయన అన్నారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు.
No Comment to " March Month Salary @ 2 Installments "