By
teacherbook -
Sunday, 29 March 2020
-
No Comments
చదువుకోవడానికి ఎన్నో మార్గాలు

ఈనాడు,
దిల్లీ: చదువుకోవాలన్న కోరిక ఉంటే కరోనా వైరస్ దాన్ని ఆపలేదని
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) పేర్కొంది. విద్యార్జన కోసం
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వైబ్‌సెట్ల వివరాలను కళాశాలల,
విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లలో ఉంచాలని కోరింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉప
కులపతులు, కళాశాలల ప్రధానోపాధ్యాయులకు యూజీసీ కార్యదర్శి ఆచార్య రజ్‌నీశ్
జైన్ లేఖ రాశారు. ‘‘మనందరం కలిసి కోవిడ్-19పై యుద్ధం చేస్తున్నాం.
ఇళ్లు, వసతిగృహాల్లోనే ఉంటూ వైరస్ వ్యాప్తి చెందకుండా చేస్తున్నాం.
ఆన్‌లైన్ అభ్యసనం ద్వారా ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూజీసీ వాటి ఇంటర్
యూనివర్సిటీ సెంటర్స్ (ఐయూసీలు)లు.. ఇన్ఫర్మేషన్, లైబ్రరీ నెట్క్‌వర్క్,
కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్(సీఈసీ) వంటి ఇన్ఫర్మేషన్,
కమ్యునికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)ని అభివృద్ధి చేశాయి. డిజిటల్ వేదికగా
వీటితో సులభంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు తమ నైపుణ్యాన్ని
పెంచుకోవచ్చు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
Share This:
teacherbook.in
No Comment to " చదువుకోవడానికి ఎన్నో మార్గాలు "