మొదటి కరోనా బాధితుడి సందేశం.
భారత పౌరులారా భయపడవద్దు: నేను, నా కుటుంబం కరోనా నుంచి కోలుకుంది. మొదటి కరోనా బాధితుడి సందేశం.
కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి భారత్ కఠిన చర్యలు అమలు చేస్తోంది. ఇళ్ల నుంచి బయటకు ఎవరూ రావొద్దని సూచిస్తోంది. వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే కరోనా సోకిన వారు త్వరగా కోలుకోవచ్చు. అంతేకాదు ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తపడొచ్చు.
తాజాగా కరోనా సోకిన
వ్యక్తి పూర్తిగా కోలుకోవడమే కాదు.. అతని కుటుంబంలోని మరో ఐదుగురు కరోనా
బాధితులు కూడా పూర్తిగా కోలుకున్నారు. ఆగ్రాకు చెందిన అమిత్ కపూర్
భారతదేశంలో మొదటి కరోనా రోగులలో ఒకరు. అతనితో పాటు వారి కుటుంబంలోని 5 మంది
పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు.
కపూర్ అధికారులతో పూర్తిగా సహకరించారు ఇతరులను కరోనా నుంచి రక్షించారు.
సామాజిక
దూరం పాటించండి. కరోనా గురించి భయందోళన చెందవద్దు. సొంతంగా శుభ్రత అనేది
చాలా ముఖ్యం. కరోనా లక్షణాలు ఉంటే అందరికి దూరంగా ఉండటం ముఖ్యమని
సూచిస్తున్నాడు. అతని కోలుకున్న తర్వాత తన ఆరోగ్య గురించి ఓ వీడియో విడుదల
చేశాడు.
No Comment to " మొదటి కరోనా బాధితుడి సందేశం. "