ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ!
ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ!
సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడి
ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఒక డీఏ
ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రం
అందజేశామని, దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏప్రిల్
1 నుంచి కొత్త డీఏ అమలులోకి రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు
నాలుగు డీఏలు బకాయి ఉన్నాయి. 2018 జూలై నాటి డీఏను ఉగాది కానుకగా
ఉద్యోగులకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని వెంకట్రామిరెడ్డి
తెలిపారు.
No Comment to " ఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ! "